ఎందుకు ఇంకా ఏడుపు, దమ్ముంటే ఇంకో సినిమా తీయ్

గత కొన్ని రోజులుగా క్రిష్-కంగనా నడుమ ప్రచ్చన్న యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. క్రిష్ తన తప్పు లేదని, తాను ప్రొజెక్ట్ నుంచి తప్పికోలేదని, కంగనా కావాలనే తప్పించిందని ప్రూవ్ చేసుకోవడానికి ఎంతగా ప్రయత్నించినా.. కంగనా వాటిని తిప్పికొడుతోంది. నిన్నటివరకు ఈ విషయమై మీడియా ముందుకురాని కంగనా.. రీసెంట్ గా ఇండియా వచ్చి ఎయిర్ పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ క్రిష్ తోపాటు క్రిష్ కి సపోర్ట్ చేస్తున్నవాళ్లందరి మీద కాస్త ఘాటుగానే స్పందించింది

“నువ్ సినిమా తీయలేదు అని నేను అనడం లేదు, అలాగే నువ్ ప్రొజెక్ట్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయావ్.. అప్పుడు నేనే మొత్తం పూర్తిచేశాను. సో, నువ్ గనుక ఇంకా నన్ను బ్యాడ్ చేయాలని చేస్తే నీ ఇష్టం. ఇంకా మంచి సినిమా తీయాగాలను అనే నమ్మకం ఉంటే.. ఇప్పుడు నిన్ను సపోర్ట్ చేస్తున్నవాళ్లందరితో ఒక ప్రొజెక్ట్ చెయ్. ఆ సినిమాతో హిట్ కొట్టి అప్పుడు మాట్లాడు” అని గట్టిగానే రిటార్ట్ ఇచ్చింది కంగనా. మరి క్రిష్ మళ్ళీ తన సైడ్ నుంచి ఏదైనా వెర్షన్ చెప్తాడో లేక ఇంతకంటే సాగదీయడం బాగోదని వదిలేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus