Kangana Ranaut: జ్యోతిక నటనపై ప్రశంసలు కురిపించిన ఫైర్ బ్రాండ్ కంగనా!

బాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొని స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా బాలీవుడ్ సెలబ్రిటీల గురించి, నేపోటిజం గురించి తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న కంగనా రనౌత్ బాలీవుడ్ లో లేడి ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది.

ఇలా తరచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే కంగనా ఇతరుల గురించి పాజిటివ్ గా మాట్లాడటం చాలా అరదు. తాజాగా సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా మంచి గుర్తింపు పొందిన జ్యోతిక గురించి కంగానా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటించిన సంగతి అందరికీ తెలిసిందే. 2005లో విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ్ తో పాటు ఇతర భాషలలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమాని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాకి రాఘవ లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చంద్రముఖి 2 సినిమాలో జ్యోతిక పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగనా జ్యోతిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇదిలా ఉండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక బాలీవుడ్ హీరోయిన్స్ లో తనకు కంగనా అంటే ఇష్టం అని తెలిపింది.

ఇక ఇటీవల ఈ వీడియోని ఒక నెటిజన్ షేర్ చేయగా..కంగనా స్పందిస్తూ..” చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఐకానిక్ నటనను నేను ప్రతిరోజు చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మేము క్లైమాక్స్ షూట్ చేస్తున్నాము. ఆమె అద్భుతమైన నటనతో మ్యాచ్ చేయటం చాలా కష్టం “అంటూ జ్యోతిక గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus