Kangana Ranaut: రోజా ఎవరో తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కంగనా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల కన్నా సౌత్ సినిమాల పైన ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వరుస సౌత్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి ఈమె త్వరలోనే చంద్రముఖి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. పి వాసు దర్శకత్వంలో రజనీకాంత్ నయనతార నటించిన చంద్రముఖి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా త్వరలోనే చంద్రముఖి 2 సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోని చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో నటించినటువంటి కంగనా తాజాగా చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా కంగనా (Kangana Ranaut) మాట్లాడుతూ తనకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి కూడా చాలా ఉందని తెలిపారు. ఆ అవకాశం వస్తే అసలు వదులుకోనని తెలిపారు. ఇక తాను దేశభక్తురాలినని అందుకే తనకు తోచినంతగా పేదలకు సహాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇలా ఈమె రాజకీయాలలోకి రావడానికి ఆసక్తిగా ఉందని చెప్పడంతో విలేకరులు ఈమెకు ఒక ప్రశ్న వేశారు. రాజకీయాలలోకి సినిమా సెలబ్రిటీలు వస్తే వారు సినిమాలకు దూరం అవ్వాల్సి ఉంటుంది

అంటూ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి రోజా ఓ సందర్భంలో తెలియజేశారు. అయితే రోజా వ్యాఖ్యలు సరైనదేనా మీరు సమర్థిస్తారా అంటూ కంగనాకు విలేఖరి ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ.. అసలు రోజా అంటే ఎవరు? అలాంటివారు ఉన్నారని తనకు తెలియదని, అలాంటప్పుడు తన గురించి నేనేం మాట్లాడతాను అంటూ షాకింగ్ సమాధానం చెప్పారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus