స్టార్స్ పై కంగనా రనౌత్ దారుణ వ్యాఖ్యలు!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదాలలో ఉంటుంది. ఆమె సిస్టర్ రంగోలి సైతం కంగనాకు ఏమాత్రం తీసి పోదు. ఎప్పటి నుండో వీరు బాలీవుడ్ పెద్దలను, స్టార్ హీరోలను, హీరోయిన్స్ ని బాహాటంగానే తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే అనేక మందితో కంగనా రనౌత్ కి గొడవలు జరిగాయి. ఐతే హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో బాలీవుడ్ లోని నెపోటిజం పై తీవ్ర విమర్శలు రేగాయి. సోషల్ మీడియా వేదికగా కరణ్ జోహార్, అలియా భట్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్, కరీనా కపూర్ వంటి వారిపై నెటిజెన్స్ విరుచుకుపడ్డారు.

దీనితో కంగనా వ్యాఖ్యలకు బలం చేకూరినట్లు అయ్యింది. దీనితో ఆమె విమర్శల దాడి మరింతగా పెంచారు. ఇక హీరోయిన్ తాప్సితో కొద్దిరోజుగా యుద్ధం చేస్తున్న కంగనా తాజాగా టాప్ స్టార్స్ రణ్వీర్ సింగ్, దీపికలపై దారుణమైన కామెంట్స్ చేసింది. ఆమె రణబీర్ గురించి మాట్లాడుతూ, ఎప్పుడూ అమ్మాయిల వెనుకబడే రణ్వీర్ ని ఎవరు రేపిస్ట్ అని పిలవరు అన్నారు. అలాగే దీపికా పదుకొనె తనకుతానే మానసిక రోగినని ప్రకటించుకున్నారు.

అయినప్పటికి ఆమెను సైకో అని ఎవరూ పిలవరు. కానీ చిన్న కుటుంబాల నుండి, నగరాల నుండి వచ్చిన వారిని మాత్రం అనేక విధాలుగా దూషిస్తున్నారు అన్నారు. స్టార్ కపుల్ పై కంగనా చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కొందరు కంగనా వ్యాఖ్యలను సమర్దిస్తుండగా, మరికొందరు సుశాంత్ వివాదాన్ని ఆమె వ్యక్తిగత కక్ష సాధింపులకు వాడుకుంటుంది అంటున్నారు.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus