Kangana: సినిమాల విషయంలో మనసులో కోరిక బయటపెట్టిన కంగనా?

బాలీవుడ్ నటి కంగనా రౌనత్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై ఫోకస్ చేశారు. ఈ క్రమంలోని ఈమె నటించిన చంద్రముఖి2 సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్ నటించినటువంటి చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సీక్వెల్ సినిమాలో రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించారు. ఇక చంద్రముఖిగా నటించిన జ్యోతిక పాత్రలో కంగనా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో కంగనా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమెకు సౌత్ సినిమాల గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

సౌత్ ఇండస్ట్రీలో మీరు ఏ హీరోతో సినిమా చేయాలి అనుకుంటున్నారనే ప్రశ్న ఈమెకు ఎదురు కావడంతో తాను రామ్ చరణ్ సార్ తో సినిమా చేయాలని ఎదురుచూస్తున్నాను అంటూ సమాధానం చెప్పారు. అలాగే ఏ డైరెక్టర్ తో పని చేయాలి అనుకుంటున్నారు అని ప్రశ్నించగా రాజమౌళి సార్ సినిమాలో పనిచేయాలని భావిస్తున్నానంటూ తెలిపారు. ఇలా కంగనా మాటలను బట్టి చూస్తే ఈమె సౌత్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ రాజమౌళిని టార్గెట్ చేశారని తెలుస్తుంది.

మరి తన మనసులో కోరికను ఈ విధంగా బయటపెట్టినటువంటి కంగనా కోరికను రాజమౌళి రామ్ చరణ్ తీరుస్తారో లేదో వేచి చూడాలి. ఇక తనకు లతా మంగేష్కర్ పాటలు అంటే చాలా ఇష్టమైన తెలిపినటువంటి ఈమె రాజకీయాల గురించి కూడా మాట్లాడారు. రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించగా ప్రస్తుతమైతే తనకు అలాంటి ఆలోచనలు లేవని భవిష్యత్తులో చెప్పలేను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus