Kangana, Alia: ‘గంగూబాయి’గా మారిన ఆలియాకు అంతిచ్చారా..!

‘నన్ను చూసి ఏడవకురా…’ ఈ బోర్డు మీరు కూడా చూసే ఉంటారు. లారీల వెనుక ఇలాంటి బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. దాని అర్థం… నా ఎదుగుదల చూసి కళ్లల్లో నిప్పులు పోసుకోకురా అని అర్థం. ఈ బోర్డు బాలీవుడ్‌లో చాలామంది నటులకు అవసరం. అంతమందికి ఆ బోర్డులు దొరక్కపోతే… కంగన కళ్ల ముందు పెట్టేస్తే సరి. ఎందుకంటే ఆమె రీసెంట్‌ టైమ్స్‌లో ఆమె నటించని ప్రతి సినిమా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంది. ఎప్పుడు చూసినా ఎవరో నాయికను ఆడిపోసుకుంటూనే ఉంటుంది.

తాజాగా ‘గంగూబాయి’ మీద తన ఏడుపు ప్రదర్శించింది. అయితే అది వర్కవుట్‌ కాకపోవడం ఇక్కడ గమనార్హం. గత నెల 25న విడుదలైన ఆలియా భట్‌ ‘గంగూబాయి’ గురించి రిలీజ్‌కి కొద్ది రోజులు ముందు కంగనా రనౌత్‌ మాట్లాడింది. సినిమా దారుణంగా పరాజయం పాలవుతుందని, నిర్మాతకు పెట్టిన డబ్బులు కూడా రావంటూ కామెంట్‌ చేసింది. కట్‌ చేస్తే సినిమా విడుదలయ్యాక… ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆలియా మీద కంగన ఏడుపు ఫలించలేదు. కంగనకు మంచి విజయం దక్కింది అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి.

ఫిబ్రవరి 25న ₹200 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. ప్రేమకథల ముద్దుగుమ్మకు నటించడమూ వచ్చని ఆమె బిగ్ డాడీ (కరణ్ జోహార్‌ను ఉద్దేశించి) నిరూపించాలని అనుకుంటున్నాడు. ఈ సినిమా అతిపెద్ద మైనస్ పాయింట్ అందులో నటించిన వారే అంటూ ఘాటుగా కామెంట్స్‌ చేసింది ఆలియా భట్‌. అలా పేరు చెప్పకుండా అలియా నటించిన ‘గంగూబాయి’ దారుణంగా పరాజయం కానుంది అని కంగన జోస్యం చెప్పింది. ఇప్పుడు చూస్తే ‘గంగూబాయి’ మొదటి ఐదు రోజుల్లో మన దేశంలో సుమారు ₹55 కోట్ల వరకు వసూళ్లు అందుకొంది.

‘సూర్యవంశీ’ సినిమా తర్వాత భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన హిందీ చిత్రం ‘గంగూబాయి’నే కావడం విశేషం. అన్నట్లు ఈ సినిమాకు ఆలియాకు సుమారు ₹20 కోట్ల పారితోషికం ముట్టజెప్పారని అంటున్నారు. సినిమా కోసం పడ్డ కష్టానికి ఆ మాత్రం అందు కోవడం సబబే అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే… ఇటీవల ఇంత మొత్తంలో పారితోషికం తీసుకున్న నటి ఆలియానే.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus