Kangana: ఆ పాత్ర కోసం మొహమాటం లేకుండా అడిగాను: కంగనా

ఏ విషయం గురించి అయినా కుండబద్ధలు కొట్టేలా అభిప్రాయాలను చెప్పే కాంట్రవర్సరీ క్వీన్‌… కంగనా రనౌత్‌ . ఈ జాతీయ ఉత్తమ నటి తాజాగా ‘చంద్రముఖి-2’గా అవతారం ఎత్తింది. ఇటీవలి కాలంలో దక్షిణాది చిత్రాలపై మక్కువ పెంచుకుంటున్న ఈ అందాల భామ వెల్లడించిన కొన్ని అభిప్రాయాలివి. సాధారణంగా విమెన్‌ ఓరియెంటెడ్‌, మేల్‌ ఓరియెంటెడ్‌ సినిమాలంటూ ట్యాగ్‌ ఇచ్చేస్తుంటాం. కానీ అలాంటి భావనను అందరూ తొలిగించుకోవాలి. సినిమాను సినిమాలాగే చూడాలి తప్ప దానికి జెండర్‌ జోడించొద్దు.

నటిగా అన్ని రకాల సినిమాల్లోనూ నటించి, ప్రేక్షకులను మెప్పించాలనేదే నా కోరిక. ఇంకెన్నాళ్లు బ్యాచ్‌లర్‌గా ఉంటావని తరచూ అడుగుతుంటారు. నిజానికి నాకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది. కానీ సరైన సమయం రావాలి కదా! ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టుంటే అప్పుడే జరుగుతుంది. నాకంటూ సొంత కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలని ఆశగా ఉంది. అలాగని తొందరపడితే జరగదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో మరి. ధామ్‌ ధూమ్‌’, ‘తలైవీ’ తర్వాత తమిళంలో నేను (Kangana) చేసిన మూడో సినిమా ‘చంద్రముఖి 2’ .

డ్యాన్స్‌, ఫైట్స్‌, మ్యూజిక్‌.. కలబోతగా వచ్చిన ఇలాంటి ఒక చిత్రంలో నటించడం ఇదే మొదటిసారి. నిజానికి దర్శకుడు వేరే కథ వినిపించడానికి నా దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో ఆయన ‘చంద్రముఖి 2’ తెరకెక్కిస్తున్నారని తెలిసి.. అందులో అవకాశం ఇవ్వమని అడిగా. ఇన్నేళ్ల నా సినీ ప్రయాణంలో అవకాశాల కోసం ఎవరినీ అడిగింది లేదు. కానీ ఐకానిక్‌ హిట్‌ ’చంద్రముఖి’ సీక్వెల్‌లో భాగమవ్వాలనే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగి మరీ సాధించుకున్నా.

చంద్రముఖి 2’ హిందీ వెర్షన్‌కి నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నా. ఆ సమయంలో గట్టి గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ డైలాగ్స్‌ చెప్పాల్సి వచ్చింది. దాంతో గొంతు బాగా వాచిపోయింది. డబ్బింగ్‌ పూర్తయ్యే సరికి నీరసపడిపోయి జ్వరం కూడా వచ్చేసింది. కొన్ని రోజులు పాటు మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడ్డా.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus