క్రిష్ పై కంగనా సహోదరి కామెంట్లు..!

  • January 28, 2019 / 12:49 PM IST

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన ‘మణికర్ణిక’ చిత్రం ఎన్నో వివాదాల నడుమ విడుదలయ్యింది. ఈ చిత్రానికి మౌత్ టాక్ బాగానే ఉన్నా… విమర్శకుల ప్రశంసలు అందుతున్నా .. ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదనే చెప్పాలి. వివాదాల కారణంగా ఈ చిత్రం పై అందరి దృష్టి పడింది. వీరనారి ఝాన్సీ లక్ష్మి బాయ్ జీవిత ఆధారంగా రూపొందిన ఈ చిత్రాన్ని… మొదట క్రిష్‌ దర్శకత్వం వహించాడు. అయితే కంగనాతో వివాదం చోటు చేసుకోవడంతో ఈ చిత్రం నుండీ తప్పుకున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఈ విషయం పై క్రిష్ స్పందించిన సంగతి తెలిసిందే. హీరోయిన్‌ కంగనా రనౌత్‌ కారణంగానే ఈ ప్రాజెక్టు నుండీ బయటకు వచేసానని… తన పట్ల ఆమె చాలా దురుసుగా ప్రవర్తించిందని క్రిష్ తెలిపాడు.

ఇదిలా ఉండగా… క్రిష్‌ వ్యాఖ్యల పై కంగన సహోదరి రంగోలి స్పందించింది. క్రిష్‌ పై తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ… “డైరెక్టర్‌గారు.. సినిమా మొత్తం మీరే తీశారు. మేం ఒప్పుకుంటాం. అయితే తెర మీద మొత్తం కంగనానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ విజయాన్ని, ప్రశంసల్ని ఆమె ఆస్వాదిస్తుంది. తనను ఒంటరిగా వదిలేయండి. దయచేసి మీరు ప్రశాంతంగా ఆసీనులుకండి’… అంటూ రంగోలి వ్యంగ్యంగా ట్వీట్‌ లో పేర్కొంది. ఇటీవల ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా.. కంగనా 70 శాతం సినిమాని తనే డైరెక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ విషయాన్ని క్రిష్‌ పూర్తిగా ఖండించాడు. కంగనా కేవలం 30 శాతం సినిమాను మాత్రమే డైరెక్ట్ చేసిందని తెలిపాడు. ఒకరు చేసిన పనిని తన చేసానని చెప్పుకుంటున్న.. ఆమెకు అసలు నిద్ర ఎలా పడుతుందో అర్థం కావడం లేదని క్రిష్‌ అసహనాన్ని వ్యక్తం చేసాడు. తాను తీసిన సన్నివేశాలనే మళ్ళీ చిత్రీకరించి ఆమె పేరు వేసుకుందని క్రిష్ తెలిపాడు..! మరి క్రిష్ వ్యాఖ్యలకి కంగనా ఎలా స్పందిస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus