‘కంగువా’ నటి హీరోయిన్ కంటే అందంగా ఉందిగా.. ఫోటోలు వైరల్!

‘కంగువా’ (Kanguva) సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడింది. కానీ సినిమా ఆ హైప్ కి తగ్గట్టు లేకపోవడం వల్ల బాక్సాఫీస్ వద్ద చతికిలపడిపోయింది అని చెప్పాలి. అయితే ‘కంగువా’ సినిమా టెక్నికల్ గా ఆకట్టుకునే అంశాలు కలిగి ఉంటుంది అనేది వాస్తవం. కొన్ని విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. టీజర్, ట్రైలర్స్ లో హైలెట్ అయ్యింది అవే.

Hema Dayal

అలాగే లెక్కకు మించిన క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉంది. ‘కంగువా’ లోని పాత్రలపై మనకి ఓ క్లారిటీ వచ్చే లోపే సినిమా అయిపోతుంది. ఇది పక్కన పెట్టేస్తే.. పైన మీరు చూస్తున్న ఫోటోలో సూర్య (Suriya) తో పాటు మరో అమ్మాయి కనిపిస్తుంది. ఆమె సినిమాలో కనిపించేది కాసేపే అయినా బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఆమె పేరు హేమ దయాల్ (Hema Dayal) అని తెలుస్తుంది. తమిళ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈమె కెరీర్ ప్రారంభించింది. విజయ్ (Vijay) , అజిత్ (Ajith) వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఈమె ముఖ్య పాత్రలు పోషించింది.

‘కంగువా’ సినిమాలో పరవనది కోనకి చెందిన ఓ గిరిజన యువతిగా (Hema Dayal) చాలా రస్టిక్ గా ఈమె కనిపించింది. మంచు కొండల్లో తీసిన యాక్షన్ సీన్లో కూడా ఈమె ఎంతో హుషారుగా నటించి హైలెట్ అయ్యింది. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఈమె పలు టీవీ షోలు, డాన్స్ షోల్లో కూడా పాల్గొంది. నిజ జీవితంలో ఈ అమ్మడు చాలా అందంగా ఉంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

పుష్ప 2 టిక్కెట్ రేట్లు.. దేవర కంటే ఎక్కువ?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus