Puri Jagannadh: అక్కినేని కాంపౌండ్ లో పూరి?

పూరి జగన్నాధ్ (Puri Jagannadh) ఇటీవల కొన్ని సినిమాలతో నిరాశపరిచినప్పటికీ, మరొక పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ‘లైగర్’ సినిమా నిరాశపరిచిన తర్వాత ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో తిరిగి ఫామ్‌లోకి రావాలని స్క్రిప్ట్ పై చాలా శ్రద్ధ పెట్టాడు. అయితే, సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. పూరి కధను తక్కువ సమయంలో పూర్తి చేసే సత్తా ఉన్నా, ఇటీవల అతనికి ఫలితాలు అనుకున్నట్లుగా రావడం లేదు. పూరి తన తదుపరి సినిమా కోసం ఏ హీరోను ఎంచుకుంటాడు అనే విషయంలో సరైన క్లారిటీ రాలేదు.

Puri Jagannadh

ఇప్పటికే రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం ‘హనుమాన్’ నిర్మాతతో కలిసి సేఫ్ బడ్జెట్‌లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ‘డబుల్ ఇస్మార్ట్’ కు డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్న నిరంజన్ రెడ్డి భారీ నష్టాలు చూసిన తర్వాత, పూరి మరో సినిమా చేయడానికి మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో తేజ సజ్జాతో సినిమా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.

ఇప్పుడు అక్కినేని కాంపౌండ్ లో పూరి అడుగులు పడినట్లు సమాచారం. అక్కినేని హీరోలు ఇటీవల హిట్ లేక జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. పూరి చూపు అక్కినేని హీరోలలో ఎవరిపై పడిందనేది సస్పెన్స్‌గా మారింది. గతంలో పూరి అఖిల్ కోసం కథ సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి.

కానీ, ‘ఏజెంట్’ ఫలితం అఖిల్‌పై తీవ్ర ప్రభావం చూపింది. పూరి కథను అఖిల్ నమ్ముతాడా అనేది ప్రశ్నగా ఉంది. అఖిల్ ప్రస్తుతం UV క్రియేషన్స్ లో ఒక కొత్త దర్శకుడి కోసం రెడీ అవుతున్నాడు. నాగచైతన్య, నాగార్జున కూడా ఈ మధ్య కాలంలో బిజీగా ఉన్నారు. మరి పూరి అఖిల్‌తోనే పనిచేస్తాడా, లేదంటే మరో హీరోతోనా అన్నది ఆసక్తికరంగా మారింది.

గోపీచంద్ – శ్రీను వైట్ల సినిమా ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయిందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus