Kanguva: కంగువా టీమ్.. అసలైన గండం తప్పింది!

కోలీవుడ్ స్టార్ సూర్య (Suriya)  నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘కంగువా’ (Kanguva) నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ  (Disha Patani) నటిస్తున్నారు. సిరుతై శివ (Siva) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలు పెంచుతూ విడుదల చేసిన టీజర్, పోస్టర్స్ ఇప్పటికే పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్నాయి. అయితే, కొద్ది రోజుల క్రితం అనూహ్యంగా ఈ సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది.

Kanguva

రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ కోర్టు కేసు దాఖలు చేయడం ద్వారా ‘కంగువా’ విడుదలకు సమస్య తలెత్తింది. నిర్మాత జ్ఞానవేల్ రాజా తమకు చెల్లించాల్సిన రుణం రూ.99 కోట్లలో, రూ.55 కోట్లు ఇంకా తిరిగి చెల్లించలేదని కోర్టుకు తెలిపారు. దాంతో మద్రాస్ హైకోర్టు నవంబర్ 7 వరకు విడుదల నిలిపివేయాలని తాత్కాలిక స్టే ఇచ్చింది. ఈ నేపథ్యంలో నవంబర్ 7న విచారణ జరగాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల విచారణ వాయిదా పడింది.

ఇటీవల మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ సమయంలో స్టూడియో గ్రీన్ తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు. అప్పటికే రిలయన్స్ సంస్థకు అప్పు మొత్తాన్ని పూర్తిగా చెల్లించామని తెలిపారు. దీంతో కోర్టు కేసును పరిశీలించి తుది తీర్పు ఇవ్వగా, ‘కంగువా’ విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవని నిర్ణయించారు. అయితే మరోసారి రిలయన్స్ సంస్థ ఉన్నత న్యాయస్థానంకు వెళ్లే అవకాశం ఉన్నట్లు టాక్ వచ్చింది.

శనివారం కూడా రెండు వర్గాల మధ్య చర్చలు జరిగినట్లు గుసగుసలు వినిపోయించాయి. కానీ ఇరువర్గాల చర్చల అనంతరం ఎలాంటి సమస్య లేకుండా గొడవ ముగిసినట్లు తెలుస్తోంది. మొత్తానికి గొడవ ముగిసిపోవడంతో ‘కంగువా’ టీమ్ ఊపిరి పీల్చుకుంది. రిలయన్స్ సంస్థకు చెల్లింపులు క్లియర్ కావడంతో, నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా పదికి పైగా భాషల్లో సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus