Monal Gajjar: మోనాల్ గజ్జర్ కు మూవీ ఆఫర్లు తగ్గిపోయాయా..?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా మోనాల్ గజ్జర్ తెలుగులో పాపులారిటీని సంపాదించుకున్నారు. తెలుగులో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించినా మోనాల్ గజ్జర్ కు బిగ్ బాస్ షో ద్వారానే గుర్తింపు వచ్చింది. బిగ్ బాస్ షో తరువాత సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న మోనాల్ డ్యాన్స్ ప్లస్ అనే రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో మోనాల్ స్కిన్ షోపై ప్రేక్షకుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

అయితే మోనాల్ అఖిల్ లవ్ ట్రాక్ వల్లే బిగ్ బాస్ షో సీజన్ 4 హిట్ అయిందని కొంతమంది ఫ్యాన్స్ భావిస్తారు. బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి ముందు ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న మోనాల్ గజ్జర్ బిగ్ బాస్ షో తర్వాత మాత్రం వెబ్ సిరీస్, టీవీ ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం. అయితే డ్యాన్స్ ప్లస్ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ షో ప్రోమోలో కన్నా మాస్టర్ మోనాల్ కు ముద్దు పెట్టగా ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

గత వారం ఎపిసోడ్ లో ఓంకార్ కన్నా మాస్టర్ ను మోనాల్ కు ఇష్టమైన పట్టు వస్త్రాలలో కనిపించిమని చెప్పారు. ఈ వారం జరిగే ఎపిసోడ్ కు కన్నా మాస్టర్ నిజంగానే పట్టు వస్త్రాలలో వచ్చారు. ఆ తరువాత మోనాల్ ను స్టేజ్ పైకి తీసుకెళ్లి ఆమెతో కలిసి స్టెప్పులేయడంతో పాటు మోనాల్ చేతికి కన్నా మాస్టర్ ముద్దు పెట్టారు. కన్నా మాస్టర్ అలా మోనాల్ చేతికి ముద్దు పెట్టడంతో కంటెస్టెంట్స్, మెంటార్స్ తో పాటు యాంకర్ ఓంకార్ సైతం అవాక్కయ్యారు. మరోవైపు మోనాల్ ఈ ఏడాది విడుదలైన అల్లుడు అదుర్స్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా సినిమా ఫ్లాప్ కావడంతో మోనాల్ పాటకు గుర్తింపు రాలేదు. మోనాల్ కు కొత్త సినిమా ఆఫర్లు అయితే రావడం లేదని తెలుస్తోంది.


వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus