Rashmika: రష్మికపై బ్యాన్ విధించిన కన్నడ ఇండస్ట్రీ.. ఆ వివాదమే కారణమా?

కన్నడ చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు రష్మిక మందన్న. ఇలా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె తెలుగు తమిళ హిందీ భాషలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇకపోతే స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక తన మాతృభాష కన్నడ గురించి కన్నడ సినిమాల గురించి ఈ మధ్యకాలంలో చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.

గతంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తనకు ఇతర భాషలలో మాట్లాడటం చాలా సులభంగా ఉంటుందని కన్నడలో మాట్లాడడం కాస్త కష్టతరంగా ఉందని చెప్పడంతో ఈ వివాదం మొదలైంది. అప్పట్లోనే కొందరు రష్మిక పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇకపోతే కన్నడ సెన్సేషనల్ మూవీ కాంతారావు సినిమా విషయంలో రష్మిక చేసినటువంటి కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. కాంతర సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త సంచలనాలను సృష్టిస్తూ ఉండగా ఈ సినిమాపై ఎంతో మంది సీనియర్ రాజకీయ ప్రముఖులు స్పందించారు.

అయితే రష్మిక మాత్రం ఈ సినిమా పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేయకపోవడమే కాకుండా ఆ సినిమా చూసే అంత టైం తనకు లేదంటూ కామెంట్ చేశారు. దీంతో హీరో రిషబ్ శెట్టి రష్మిక మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా తలెత్తయని తెలుస్తోంది. ఈ విధంగా ఈమె సొంత కన్నడ చిత్ర పరిశ్రమ గురించి కన్నడ భాష గురించి ఈ విధమైనటువంటి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తన ఆటిట్యూడ్ ప్రదర్శించడంతో కన్నడ చిత్ర పరిశ్రమ ఈమె వ్యవహరి శైలి పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకుందని తెలుస్తోంది.

త్వరలోనే రష్మిక పై కన్నడ ఇండస్ట్రీ బ్యాన్ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.ఇదే కనుక జరిగితే పాన్ ఇండియా స్థాయిలో రష్మిక నటించబోయే సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న పుష్ప 2 సినిమా పై ఈ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus