శాండిల్ వుడ్ హీరోలు టాలీవుడ్ లో పాగా వేస్తారా?

ప్రస్తుతం తెలుగు సినిమాలు ఇతర రాష్ట్రాల్లో కూడా సక్సెస్ సాధించి కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. బాహుబలి2, పుష్ప ది రైజ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాయి. ఇదే సమయంలో కన్నడ సినిమాలైన కేజీఎఫ్ ఛాప్టర్2, 777 ఛార్లీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయనే సంగతి తెలిసిందే. ఈరోజు సుదీప్ హీరోగా నటించిన విక్రాంత్ రోణా థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొంతమంది ఈ సినిమా బాగుందని చెబుతుంటే మరి కొందరు మాత్రం ఈ సినిమా ఆశించిన విధంగా లేదని కామెంట్లు చేస్తున్నారు. కథ బాగానే ఉన్నా కథనం బాలేదని ప్రేక్షకులు ఈ సినిమా గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. భారీ విజువల్స్ తో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చే ఛాన్స్ ఉంది. కేజీఎఫ్2 సక్సెస్ తర్వాత తెలుగులో కన్నడ హీరోల సినిమాలు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో రిలీజవుతున్నాయి.

మంచి కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న నేపథ్యంలో యశ్, సుదీప్, రక్షిత్ శెట్టి టాలీవుడ్ మార్కెట్ పై దృష్టి పెట్టారు. ఈ హీరోల తర్వాత ప్రాజెక్ట్ లు కూడా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ హీరోలకు ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగే అవకాశం ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది కన్నడ హీరోలు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతుండగా శాండిల్ వుడ్ హీరోలు కూడా పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలా ప్రయత్నం చేసేవాళ్లలో ఎంతమంది సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus