ప్రశాంత్ నీల్..రాజమౌళి, శంకర్ లను చూసి నేర్చుకోవాలట!

కన్నడ పరిశ్రమలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ సంచలనం. చేసింది రెండు చిత్రాలే అయినా వంద చిత్రాలకు సరిపడా క్రేజ్ సంపాదించారు. ప్రశాంత్ నీల్ రెండవ చిత్రంగా వచ్చిన కెజిఎఫ్ ఎంతటి సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మూవీ విజయం కన్నడ యంగ్ హీరో యష్ ని పాన్ ఇండియా స్టార్ గా చేయడగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసింది. మరి కన్నడ సినిమాకు నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చిన ఈ దర్శకుడిపై.. ఇప్పుడు సొంత పరిశ్రమలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.

గెట్ లాస్ట్ ప్రశాంత్ నీల్ అనే యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేసి కన్నడిగులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆగ్రహానికి కారణం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించడమే. నిన్న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో మూవీ కన్ఫర్మ్ చేశాడు. కొద్దిరోజులుగా ఎన్టీఆర్ తో ఆయన మూవీ చేస్తున్నారని వార్తలు వస్తున్నా స్పష్టత లేదు. నిన్న ప్రశాంత్ నీల్ ట్వీట్ తో ఆ క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యింది.

ఐతే ఈ విషయం కన్నడ ప్రేక్షకులకు మింగుడు పడడం లేదు. రాజమౌళి, శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్స్ కూడా ఇంత వరకు ఇతర పరిశ్రమలకు చెందిన హీరోలతో సినిమాలు చేయలేదు. వారి టాలెంట్ సొంత పరిశ్రమకు చెందిన హీరోల అభివృద్ధికి ఉపయోగించారు. అలాంటిది ప్రశాంత్ నీల్ టాలీవుడ్ కి చెందిన ఎన్టీఆర్ తో మూవీ చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌత్ లో తమిళులకు వల్లే కన్నడిగులకు కూడా ఈ భాషా బేధాలు ఎక్కువే. మరి ఈ వివాదం ఎంత వరకు తీసుకెళతారో చూడాలి.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus