Kannappa Teaser Review: మంచు విష్ణు ‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది..ఎలా ఉందంటే?

మంచు విష్ణు ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్వయంగా మంచు విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు విష్ణు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ‘కన్నప్ప’ రూపొందుతుంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.

దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈరోజు ‘కన్నప్ప’ ట్రైలర్ ని లాంచ్ చేసింది చిత్ర బృందం. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. ఇది 1 : 39 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘కాలాముఖ.. వాయు లింగాన్ని పికిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని, నీ తమ్ముడు టెంకనతో సహా అందరినీ చంపేశాడు’ అంటూ వచ్చే వాయిస్ ఓవర్లో టీజర్ మొదలైంది.ఆ వెంటనే తిన్నడు అనే పాత్రలో హీరో మంచు విష్ణు ఎంట్రీ ఇచ్చాడు.

అటు తర్వాత మోహన్ బాబు, మోహన్ లాల్..ల పాత్రలు కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకి సంబంధించిన విజువల్స్ తోనే టీజర్ ను కట్ చేసినట్టు తెలుస్తుంది.టీజర్ చివర్లో ప్రభాస్ కళ్ళు, శివుని పాత్ర చేస్తున్న అక్షయ్ కుమార్ కళ్ళు .. చూపించారు. అయితే ఎవరి పాత్రలకి డీటెయిలింగ్ ఇవ్వలేదు. లొకేషన్స్, సినిమాటోగ్రఫీ.. బాగున్నాయి. ‘కన్నప్ప’ టీజర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus