2022 లో వచ్చిన ‘కాంతార’ సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. కన్నడలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా దాదాపు 2 వారాల గ్యాప్ తర్వాత తెలుగుతో పాటు మిగతా భాషల్లోకి డబ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ మంచి విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించారు.అయితే ఒకటి కాదు.. 2,3 సీక్వెల్స్ వస్తాయని కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఇందులో భాగంగా ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ రూపొందింది. ఈ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ ట్రైలర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది.
‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్ 1’ ట్రైలర్ 2 నిమిషాల 56 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘కాంతార’ క్లైమాక్స్ లో శివ కోలం ఆడుతూ అతని తండ్రి మాదిరి అడవిలోకి వెళ్లి మాయమైపోతాడు. ఆ తర్వాత అతను మాయమైపోయిన చోటికి అతని కొడుకు వెళ్లి.. ‘నాన్న ఇక్కడ ఎందుకు మాయమైపోయాడు’ అంటూ అంతుచిక్కని ప్రశ్నకి సమాధానం కోసం అన్వేషిస్తున్నట్టు ట్రైలర్ ను ప్రారంభించారు.
ఆ వెంటనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి తీసుకెళ్లారు. అంటే శివ తాత, ముత్తాత..ల టైం లైన్..కి అనుకోవాలి. ఆ టైంలో వారి పూర్వీకులు, వారికి దొరికిన దేవుడు.. వారు నివసిస్తున్న అడవిని లాక్కోవాలని కుట్రలు చేసే రాజులు.. ఈ క్రమంలో జరిగిన యుద్ధం..! వీటినే ప్రధానంగా చేసుకుని ట్రైలర్ ను కట్ చేశారు. అలాగే రుక్మిణీ వసంత్, రిషబ్ శెట్టి..ల మధ్య లవ్ ట్రాక్ ను కూడా హైలెట్ చేశారు.
సినిమాకి వీరి లవ్ ట్రాక్ కూడా కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇక్కడ ‘కాంతార’ అంటే ఒక తెగ అని చెప్పడం జరిగింది. సో ఈ సీక్వెల్ లో స్టోరీలో చాలా డెప్త్ ఉందని అర్థం చేసుకోవచ్చు. విజువల్స్ కి కూడా పెద్ద పీట వేశారు.చూస్తుంటే ‘ఓజి’ కి ‘కాంతార’ సీక్వెల్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :