Kantara: కాంతార ఏ ఏరియాలో ఎంత వసూలు చేసిందంటే..!

  • November 22, 2022 / 06:44 PM IST

ఓటీటీ రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చినా కానీ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూనే ఉంది ‘కాంతార’.. కంటెంట్ కొత్తగా ఉంటే.. సౌత్ ఆడియన్స్ భాషతో సంబంధం లేకుండా సినిమాలని ఆదరిస్తారు అనే మాటని మరోసారి నిజమని నిరూపించింది రీసెంట్ సెన్సేషన్ ‘కాంతార’.. రిషబ్ శెట్టి నటించడంతో పాటు దర్శకత్వం వహించిన ‘కాంతార’ ఇప్పటివరకు క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు.. ప్రపంచమంతా పూనకం వచ్చినట్టు ‘కాంతార’ జపం చేసేలా చేశాడు రిషబ్..

బాక్సాఫీస్ దగ్గర జాతర వాతావరణం తీసుకొచ్చాడు.. మొదట కన్నడలో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన తర్వాత ‘కాంతార’ ను మిగతా భాషల్లో విడుదల చేశారు.. అప్పటికే కొంతమంది సెలబ్రిటీలు ‘కాంతార’ మూవీ మాస్టర్ పీస్ అని ప్రశంసిస్తూ పోస్టులు చేశారు. కట్ చేస్తే.. హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం లాంగ్వేజెస్‌లో దుమ్ము దులిపేసింది.. ప్రస్తుతం ఏడో వారంలోనూ రిపీట్ ఆడియన్స్ థియేటర్లకి వస్తున్నారు.. మొదటిరోజు 2 కోట్లు కలెక్ట్ చేసిన ‘కాంతార’ ఇప్పుడు 400 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైపోయింది.

ఇక కన్నడ సినిమా చరిత్రలో ఇప్పటివరకు హయ్యస్ట్ కలెక్షన్లు సాధించిన ‘కె.జి.యఫ్’ రికార్డుని బీట్ చేయడానికి అతి చేరువలో ఉంది ‘కాంతార’.. ఇప్పటివరకు సెకండ్ ప్లేస్‌లో ఉన్న ‘కాంతార’ కొద్దిరోజుల్లో శాండల్ వుడ్‌లో నంబర్ వన్ మూవీగా హిస్టరీ క్రియేట్ చేయనుంది. ఇంకో హైలెట్ ఏంటంటే నార్త్‌లో రూ. 100 కోట్లకు దగ్గర్లో ఉంది..

‘కాంతార’ ఈ రేంజ్ వసూళ్ల తెస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా బాలీవుడ్ బడా బాబులు అయితే ఈ కలెక్షన్లు చూసి షాక్ తిన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్ల మార్క్ టచ్ చేసిందీ చిత్రం.. ఏ ఏ ఏరియాలో ఎంతెంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం..

కర్ణాటక 168.50 cr
ఏపీ, తెలంగాణ 60.00 cr
తమిళనాడు 12.70 cr
కేరళ 19.20 cr
ఓవర్సీస్ 44.50 cr
నార్త్ ఇండియా 96.00 cr
టోటల్ 400.90 cr

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus