Kantara Collections: పది రెట్లు లాభాలు..ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘కాంతార’ !

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత 6 వారాల వరకు ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేస్తూనే వచ్చింది.

తెలుగు సినిమాలే బాక్సాఫీస్ వద్ద 3 వ వారం వరకు నిలబడలేకపోతుండగా.. డబ్బింగ్ సినిమా 6 వారాల పాటు మంచి కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు. ఒకసారి ‘కాంతార’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 12.86 cr
సీడెడ్ 3.23 cr
ఉత్తరాంధ్ర 3.70 cr
ఈస్ట్ 2.16 cr
వెస్ట్ 1.33 cr
గుంటూరు 1.75 cr
కృష్ణా 1.73 cr
నెల్లూరు 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 27.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 27.97 cr (షేర్)

‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ ఫుల్ రన్ ముగిసేసరికి రూ.27.97 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.25.97 కోట్ల భారీ లాభాలను అందించింది.

ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్లకు పదింతలు లాభాలను అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి.. ‘పుష్ప'(పుష్ప ది రైజ్) కలెక్షన్లను బ్రేక్ చేసింది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus