ఒకప్పుడు బంగ్లాలో .. ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్న కాంతారావు వారసులు!

  • November 17, 2022 / 10:55 AM IST

నటుడు కాంతారావు ఇప్పటి తరానికి ఈయన పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ ఒకప్పుడు ఈయన కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ , శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ల పక్కనే హీరోగా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే వాళ్ళతో పోటీకి నిలబడలేకపోయిన ఈయన సహాయ నటుడిగా మారారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో జన్మించారు కాంతారావు. నిర్దోషి అనే చిత్రం ద్వారా ఈయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

అటు తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోగా , సహాయ నటుడిగా, విలన్ గా కూడా నటించి మెప్పించారు. మొత్తంగా ఈయన 400కి పైగా చిత్రాల్లో నటించారు. 2007 లో వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ ఈయన చివరి చిత్రం అని అందరూ అంటుంటారు కానీ తర్వాత ఆయన నటించిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ఇప్పటికీ రిలీజ్ అవ్వలేదు అని ఇన్సైడ్ టాక్. 2000 వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య పురస్కారం ఈయన్ని వరించింది.

ఓ సందర్భంలో కాంతారావు గారి గురించి దివంగత స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు ..’ తెలుగు చిత్ర సీమకు ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళయితే వాటి మధ్య తిలకం వంటి వారు కాంతారావు ‘ అంటూ చెప్పుకొచ్చారు. 2009 లో ఈయన క్యాన్సర్ తో మరణించారు. ఈయన చనిపోయే టైంకి కాంతారావు వయసు 85 సంవత్సరాలు. అయితే ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కాంతారావు గారి పిల్లలు ఇప్పుడు ఉండడానికి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు.

కాంతారావు గారు ఆస్తులు అమ్ముకుని సినిమాలు తీయడం వల్ల ఇప్పుడు వారికి నిలువ నీడ లేకుండా పోయిందట. ఒకప్పుడు చెన్నైలో బంగ్లాలో ఉందేవారు ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్టు వారు చెప్పుకొచ్చారు.తమకు ఇల్లు కేటాయించాలని తెలంగాణా ప్రభుత్వాన్ని వారు అర్ధిస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus