‘కనులు కనులను దోచాయంటే’ రీ రిలీజ్.. నిజమేనా?

‘ఓకే బంగారం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్నాడు మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్. ఆ తరువాత ‘మహానటి’ చిత్రంలో జెమినీ గణేషన్ పాత్రతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ చిత్రంలో నిజంగా జెమినీ గణేషన్ అనేంతలా నటించి.. ప్రేక్షకులకు చాలా కోపం తెప్పించాడు .. అంటే అంత బాగా నటించాడని చెప్పొచ్చు. అలాంటి దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం ఈ ఏడాది విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

దేసింగ్ పెరియసామి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆంటోని జోసెఫ్ నిర్మించాడు. రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఓ మహమ్మారి వల్ల లాక్ డౌన్ ఏర్పడటంతో థియేటర్లు మూత పడ్డాయి. దాంతో భారీగా కలెక్ట్ చెయ్యాల్సిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ టాక్ తో సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేశారట.

అయితే మన తెలుగు రాష్ట్రాల్లో కాదు.. దుబాయ్ లో రీ రిలీజ్ చేశారట. ఈ విషయాన్ని దుల్కర్ సల్మాన్ తన ఇన్స్టా ద్వారా తెలియజేసాడు. ‘చాలా రోజుల తర్వాత థియేటర్లు ఓపెన్ అయ్యి నా సినిమా రిలీజ్ కావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ పేర్కొన్నాడు. దీని పై ఆయన అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus