దేశం మొత్తం గర్వించే సినిమాలు తీస్తారని ఎస్.ఎస్.రాజమౌళికి (S. S. Rajamouli) పేరు. అలాగే ఆయన నుండి ఇప్పటివరకు వచ్చిన సినిమాలు అన్నీ అలానే ఉంటాయని చెప్పలేం. రెండోది ఆయన అన్ని సినిమాలకు ఆ స్థాయి పక్కాగా వచ్చేసింది అని కాదు. కానీ జక్కన్న తెరకెక్కించిన సినిమాల విజయాల స్థాయి మాత్రం అదే. ‘బాహుబలి’ (Baahubali) సినిమాలు.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) సినిమా ఆ స్థాయి విజయం అయితే అందుకున్నాయి. కానీ ఆయన సినిమాకు లాజిక్‌లు ఉండవు అనే విమర్శలు ఉన్నాయి.
రాజమౌళి సినిమాలు చూస్తున్నప్పుడు లాజిక్ కాకుండా మేజిక్‌ను మాత్రమే గుర్తు పెట్టుకోవాలి అనే కామెంట్ తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఈ మాటలు అంటే ఆయన అభిమానులు ఒప్పుకోవచ్చు. అయితే ఆయన సినిమాను తొలిసారి దేశవ్యాప్తంగా పరిచయం చేసిన నిర్మాత కూడా ఇప్పుడు ఇదే మాట అంటున్నారు. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు, నిర్మాతగా పేరు గాంచిన కరణ్ జోహారే (Karan Johar) ఈ మాట అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
గొప్ప సినిమాలకు లాజిక్‌తో అవసరం లేదని కరణ్ జోహార్ (Karan Johar) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దర్శకుడికి తన కథపై నమ్మకం ఉంటే సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఎస్.ఎస్.రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), అనిల్ శర్మ (Anil Sharma) సినిమాల గురించి మాట్లాడారు. కొన్ని సినిమాలు నమ్మకం ఆధారంగా హిట్ అవుతాయి. గొప్ప దర్శకుల సినిమాల్లో ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పారు. సినిమాపై నమ్మకం ఉంటే ప్రేక్షకులు లాజిక్ పట్టించుకోరు అని కూడా అన్నారు.
ఈ క్రమంలో ఉదాహరణగా రాజమౌళి సినిమాల గురించి ప్రస్తావించారు కరణ్ జోహార్ (Karan Johar). ఆయన సినిమాల్లో లాజిక్ గురించి ప్రేక్షకులు ఎప్పూడూ మాట్లాడరని, ఆయనకు తన కథపై పూర్తి నమ్మకం ఉంటుందని, ఎలాంటి సన్నివేశాన్నైనా ప్రేక్షకులకు నమ్మకం కలిగేలా తెరకెక్కించగలరని చెప్పారు కరణ్. ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘యానిమల్’ (Animal) , ‘గదర్’ సినిమాలు అందుకే బాగా ఆడాయి అని కూడా చెప్పారు.