Karan, ileana: ఇలియానా గురించి క్లారిటీ ఇచ్చిన కరణ్‌జోహార్‌

ఇలియానా – సెబాస్టియన్‌ మధ్య ఏం జరుగుతోంది? ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? లేక స్నేహితులా? అనుకోకుండా కలిశారా? గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వీటి గురించే చర్చ నడుస్తోంది. సెబాస్టియన్‌ అంటే ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కట్రినా కైఫ్‌ సోదరుడే సెబాస్టియన్‌. పూర్తి పేరు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌. ఆ మధ్యలో మాల్దీవుల్లో కట్రినా కుటుంబంతో ఇలియానా కనిపించింది. అప్పటి నుండే ఈ పుకార్లు మొదలయ్యాయి. తాజాగా దీనిపై క్లారిటీ వచ్చింది.

కొన్ని నెలల క్రితం వరకు ఇలియానా.. ఆండ్రూ నీబోన్‌ అనే విదేశీయుడితో డేటింగ్ చేసేది. ఒకానొక సమయంలో ఇద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయిందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలొచ్చాయి. కానీ ఏమైందో ఏమో ఈ జంట విడిపోయింది. ఆ తర్వాత ఇలియానా డిప్రెషన్‌లోకి వెళ్లింది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఆ తరువాత మళ్లీ దక్షిణాదిలో అవకాశాల కోసం ప్రయత్నించి రీఎంట్రీ ఇచ్చినా విఫలమైంది.

ఇప్పుడు సెబాస్టియన్‌తో ఇలియానా డేటింగ్ చేస్తోందని సమాచారం. ఇటీవల కట్రినా బర్త్ డే వేడుకలు మాల్దీవుల్లో జరగ్గా, ఇలియానా పాల్గొంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే ఎక్కడో క్లారిటీ మాత్రం మిస్‌ అయ్యింది. అయితే తాజాగా ఈ విషయాన్ని కరణ్ జోహార్ కన్‌ఫామ్‌ చేశారు. ‘కాఫీ విత్ కరణ్’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఈ విషయం బయటకు వచ్చింది. కట్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ కొత్త ఎపిసోడ్‌కి గెస్ట్‌లుగా వచ్చారు.

ఈ క్రమంలో సెబాస్టియన్ లవ్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు కరణ్. కట్రినా మాల్దీవులు ట్రిప్‌ ఫొటోలు బయటకొచ్చినప్పుడు.. మైండ్‌లో కొన్ని ప్రశ్నలు తిరిగాయని చెప్పారు. ఇలియానా, సెబాస్టియన్ తొలిసారి ఓ పార్టీలో కలిశారని, అప్పుడే ఇంత ఫాస్ట్‌గా స్టోరీ నడిచిందా? అని అనుకున్నానని కరణ్‌ తెలిపాడు. ఆ కామెంట్స్‌ విని నవ్వేసిన కట్రినా.. కరణ్ పార్టీలో అందరిననీ గమనిస్తుంటారని చురక అంటించే ప్రయత్నం చేసింది. అలా ఇలియానా – సెబాస్టియన్‌ విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus