Karate Kalyani: ప్రముఖ నటి కరాటే కళ్యాణికి ప్రాణ హాని.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియాలో మళ్లీ హాట్ టాపిక్ అవుతున్నారు. తనకు ప్రాణహాని ఉందంటూ కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తన కారు టైర్లను కోసేశారని ఆమె వెల్లడించడం గమనార్హం. ఈ విషయం గమనించకుండా కారులో ప్రయాణించగా కారు టైర్ పేలిందని ఆమె వెల్లడించారు. ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంటే వెళ్లానని అక్కడినుంచి తిరిగి వచ్చే సమయంలో ఈ విధంగా జరిగిందని ఆమె తెలిపారు.

కారు టైర్లను పరిశీలించిన మెకానిక్ ఎవరో కావాలని కారు టైర్లను కోసేశారని చెప్పారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు. అయితే కరాటే కళ్యాణి చేసిన కామెంట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరాటే కళ్యాణికి సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడం లేదు. కరాటే కళ్యాణికి ఈ వివాదాల వల్ల సినిమా ఆఫర్లు సైతం తగ్గుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ విషయంలో కరాటే కళ్యాణి చేసిన రచ్చ అంతాఇంతా కాదు. కరాటే కళ్యాణి చేసిన రచ్చ వల్ల విగ్రహావిష్కరణకు సైతం బ్రేకులు పడ్డాయి. రాబోయే రోజుల్లో సైతం విగ్రహావిష్కరణ ఉంటుందో లేదో క్లారిటీ లేదు. కరాటే కళ్యాణి చేసిన రచ్చ నందమూరి అభిమానులను సైతం ఒకింత బాధ పెట్టింది. విగ్రహంలో మార్పులు చేస్తామని చెప్పినా కరాటే కళ్యాణి నెగిటివ్ కామెంట్లు చేశారు.

అదే సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి (Karate Kalyani) కరాటే కళ్యాణికి భారీ షాక్ తగిలింది. కరాటే కళ్యాణి కెరీర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ఆమెపై కొంతమంది ప్రేక్షకుల్లో నెగిటివిటీ పెరుగుతోంది. కరాటే కళ్యాణి గతంలో పోషించిన పాత్రలను చూపిస్తూ కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. కరాటే కళ్యాణి వివాదాలకు దూరంగా ఉండాలని ఆమె శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus