Karate Kalyani: బిగ్ బాస్ షోపై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్.. ఆమె ఏమన్నారంటే?

సినిమాల ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా, వివాదాల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో కరాటే కళ్యాణి ఒకరు కాగా కరాటే కళ్యాణికి సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. బిగ్ బాస్ సీజన్7 తాజాగా ప్రారంభం కాగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోను ఆపాలని చాలామంది కోరుతుంటారని కోర్టులో పిటిషన్లు వేస్తుంటారని ఆమె చెప్పారు. బిగ్ బాస్ షో వినోదంగా సాగే ప్రోగ్రామ్ అని ఈ షో వల్ల మంచి జరుగుతుందని చెడు జరుగుతుందని కరాటే కళ్యాణి పేర్కొన్నారు.

బిగ్ బాస్ షో వల్ల నాకు ఒరిగిందేమీ లేదని (Karate Kalyani) కరాటే కళ్యాణి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. నా క్రేజ్ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుందని కరాటే కళ్యాణి కామెంట్లు చేశారు. బిగ్ బాస్7 కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. బిగ్ బాస్ షో సీజన్4 సక్సెస్ సాధించిందని బిగ్ బాస్6 షో హిట్టో ఫ్లాపో నాకు తెలియదని కరాటే కళ్యాణి కామెంట్లు చేశారు.

బిగ్ బాస్ షోలో మళ్లీ ఛాన్స్ వస్తే పాల్గొనడానికి అభ్యంతరం లేదని కరాటే కళ్యాణి వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని సమాచారం అందుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7 లాంఛింగ్ ఎపిసోడ్ లో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. మిగతా కంటెస్టెంట్లు ఈ షోలో ఎప్పుడు పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ షో లాంఛింగ్ ఎపిసోడ్ విషయంలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. బిగ్ బాస్ షో అభిమానులు మాత్రం ఈ షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ షో కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు భారీగా ఉన్నాయని తెలుస్తోంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus