Karate Kalyani: నాతో తప్పుగా ప్రవర్తించాడు.. యూట్యూబర్ పై నటి ఆరోపణలు!

కరాటే కళ్యాణి, యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గురువారం నాడు రాత్రి హైదరాబాద్ యూసుఫ్ గూడ బస్తీలో యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిని వెంటాడి మరీ శ్రీకాంత్ రెడ్డిపై దాడి చేశారు. కరాటే కళ్యాణితో పాటు మరికొంతమంది కలిసి చితకబాదారు. గత కొన్నేళ్లుగా శ్రీకాంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో వల్గర్ పోస్ట్ లు పెడుతున్నాడు. ప్రాంక్ వీడియోల పేరుతో జనాల దగ్గరకు వెళ్లి సెక్స్ గురించి మాట్లాడుతూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు.

అయితే ఈ ప్రాంక్ వీడియోల్లో మహిళలను, హిందువులను అగౌరవపరిచేలా ఉండడంతో శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మరీ అతడిని చితకబాదింది కరాటే కళ్యాణి. అతడు తీస్తున్న వీడియో కంటెంట్ ను తిట్టిపోస్తూ.. అతడి చెంపపై కొట్టింది. కరాటే కళ్యాణి అనుచరులు కూడా ఒక్కసారిగా శ్రీకాంత్ పై దాడి చేశారు. దీంతో అతడు తిరగబడ్డాడు. కరాటే కళ్యాణితో పాటు తనను కొట్టిన వారిపై దాడి చేశాడు శ్రీకాంత్ రెడ్డి. ఈ గొడవలో కరాటే కళ్యాణి చెంప పగలగొట్టాడు శ్రీకాంత్.

దెబ్బకి కిందపడిపోయింది కరాటే కళ్యాణి. అయినప్పటికీ మళ్లీ లేచి శ్రీకాంత్ పై విరుచుకుపడింది. తను తీస్తోన్న ఫ్రాంక్ వీడియోలు నచ్చకపోతే వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అంతేతప్ప తనకు కొట్టే హక్కు లేదంటూ కరాటే కళ్యాణిపై మండిపడ్డాడు శ్రీకాంత్ రెడ్డి. తనతో వీడియో తీసుకోవడానికి కళ్యాణి డబ్బు అడిగిందని.. అవి ఇవ్వకపోవడంతోనే ఇలా చేసిందంటూ ఆరోపణలు చేశాడు శ్రీకాంత్ రెడ్డి. ఇక ఆమె ఏకంగా శ్రీకాంత్ రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తన పక్కలో పడుకోవాలని అడిగాడని సంచలన ఆరోపణలు చేసింది.

తనను అసభ్యంగా తాకడంతో చెంప పగలగొట్టానంటూ చెప్పుకొచ్చింది. ప్రాంక్ వీడియోల పేరుతో మహిళల్ని ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడని.. ఎక్కడెక్కడో చేతులు వేసి మహిళల్ని అగౌరవ పరుస్తున్నాడని ఆరోపించింది కరాటే కళ్యాణి. ఈ మొత్తం సంఘటనను కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేసింది. దాడి అనంతరం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus