Kareena Kapoor: కరీనా కొత్త కారు ఖరీదు ఏంతో తెలిస్తే షాక్ అవుతారు..!

  • October 19, 2023 / 08:02 PM IST

బాలీవుడ్ సీనియర్ బ్యూటి కరీనా కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఒకవైపు వరుస సినిమాలు.. మరోవైపు వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ బాగా సంపాదిస్తున్నారు.. ఇక ఫ్యాషన్ ఐకాన్ కూడా బాగుంటుంది.. ట్రెండ్ కు తగ్గట్లు డ్రెసులు వెయ్యడంతో పాటు లగ్జరీ వస్తువులనే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది.. తాజాగా మరో లగ్జరీ కారును కొనుగోలు చేసింది.. ప్రముఖ కార్ల దిగ్గజ సంస్థ అయిన ల్యాండ్‌ రోవర్ డిఫెండర్‌ ఎస్‌యూవీ కారును సొంతం చేసుకుంది.

ఆ కారు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. ఆ కారు ధర అక్షరాల రూ.1.2 కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇక కరీనా సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కరీనా కపూర్ హీరోయిన్ గా హన్సల్‌ మెహతా తెరకెక్కిస్తున్న చిత్రం ది బకింగ్‌హామ్‌ మర్డర్స్‌లో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని కరీనా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

ఈ చిత్రంలో జస్‌ భమ్రా అనే డిటెక్టివ్‌గా కరీనా కనిపించనుంది.. ఈ సినిమాకు సంబందించిన పోస్టర్స్ సినీ ప్రియులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా గురించి కరీనా మాట్లాడుతూ.. ఇరవై మూడేళ్లుగా ఈ పాత్ర కోసమే ఎదురుచూస్తున్నా. డిటెక్టివ్‌ నేపథ్యంలో తెరకెక్కే పాత్రలకి నేను పెద్ద అభిమానిని. కరమ్‌చంద్‌, హెలెన్‌ మిరెన్‌, అగాథా క్రిస్టీలాంటి రచయితల కథలతో తెరకెక్కిన సిరీస్‌లు చూశా.

ఇలాంటి పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా తాను సిద్ధమని చెప్పుకొచ్చింది.. ఇకపోతే ఈ సినిమాలో యశ్‌ టాండన్‌, రణ్‌వీర్‌ బ్రార్‌, కీత్‌ అలెన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కుతున్న ఈ సినిమాను శోభా కపూర్‌, ఏక్తా కపూర్‌, కరీనాకపూర్‌ (Kareena Kapoor) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus