Kareena Kapoor: సైఫ్ ను అందుకే పెళ్లి చేసుకున్నాను.. కరీనా కామెంట్స్ వైరల్?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో కరీనాకపూర్ ఒకరు అయితే ఈమె ప్రస్తుతం ఒకవైపు సినిమాలలోను వెబ్ సిరీస్ లలోను నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా మరోవైపు పిల్లల బాధ్యతలను చూసుకుంటూ ఒక తల్లిగా తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇక ఈమె సినిమాలలో నటించడమే కాకుండా ప్రొడక్షన్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఒకేసారి అన్ని బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి కరీనాకపూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పెళ్లి పిల్లలు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కరీనాకపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే ఈయనకు అప్పటికే పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వీరిద్దరూ విడిపోవడంతో కరీనాకపూర్ తనని పెళ్లి చేసుకున్నారు. ఇలా సైఫ్ అలీ ఖాన్ ప్రేమలో పడినటువంటి కరీనాకపూర్ దాదాపు 5 సంవత్సరాల పాటు ఆయనతో సహజీవనం చేశారు.

ఇలా సహజీవనం చేసినటువంటి కరీనాకపూర్ అనంతరం ఆయనని పెళ్లి చేసుకొని ఇద్దరు అబ్బాయిలకు తల్లిగా మారారు. ప్రస్తుత కాలంలో వివాహ వ్యవస్థ గురించి ఈమె మాట్లాడుతూ చాలామంది పిల్లల కోసమే పెళ్లి చేసుకుంటున్నారని ఈమె తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా పిల్లల గురించి ఆలోచించకపోతే అలాంటివారు వివాహ బంధంలోకి అడుగు పెట్టాల్సిన పనిలేదని వారు సహజీవనం కూడా చేయవచ్చని ఈమె తెలియజేశారు.

నేను కూడా సైఫ్ తో ఐదు సంవత్సరాల పాటు సహజీవనం చేసిన అనంతరం పిల్లల కోసమే తనని పెళ్లి చేసుకున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ లో వైరల్ అవుతున్నాయి. సైఫ్ అలీ ఖాన్ ఇదివరకే అమృత సింగ్ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 2004వ సంవత్సరంలో విడాకులు తీసుకొని విడిపోగా 2012 వ సంవత్సరంలో (Kareena Kapoor) కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ వివాహం చేసుకున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus