Puneeth Rajkumar: పునీత్‌ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్ల రేర్‌ మూవ్‌!

దివంగత కన్నడ కథానాయకుడు, పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కోసం కన్నడ డిస్ట్రిబ్యూటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పునీత్‌ నటించిన ఆఖరి చిత్రం ‘జేమ్స్‌’ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా సినిమాలోని పునీత్‌ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సైనికుడి దుస్తుల్లో పునీత్‌ ఉన్న ఆ పోస్టర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమా విషయంలో పంపిణీదారులు తీసుకున్న నిర్ణయం కూడా.

‘జేమ్స్‌’ సినిమాను మార్చి 17న విడుదల చేయాలని చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. దీనికి తగ్గట్టుగా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ను వేగంగా పూర్తి చేస్తున్నారట. ఈ సినిమా పునీత్‌ ఆఖరి చిత్రం కావడంతో ఈ సినిమా విడుదలైన వారం వరకు ఇంకో సినిమా విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుందట. అంటే ‘జేమ్స్‌’ విడుదలైన తర్వాత 24 వరకు ఇంకో సినిమా శాండిల్‌ వుడ్‌లో రాదు. ఇది పునీత్‌కు తామిచ్చే నివాళి అని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.

పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన ఆఖరి సినిమా కావడంతో దీనికి బ్రహ్మరథం పట్టేందుకు శాండిల్‌ వుడ్‌ అంతా సిద్ధమవుతోంది. అందులో భాగంగానే పంపిణీదారులు ఈ ప్రయత్నం చేస్తున్నారు. దీంతో మార్చి 17 నుండి 24 వరకు ఇతర భాషల్లో విడుదలైన సినిమాలు కూడా కన్నడ ఇండస్ట్రీలో విడుదల కావు. చేతన్‌ కుమార్‌ తెరకెక్కించిన ఈ సినిమాతో పునీత్‌ రాజ్‌ కుమార్‌ సోదరులు రాఘవేంద్ర రాజ్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌ కూడా నటించడం విశేషం.

ఈ నేపథ్యంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ విడుదల తేదీ కూడా మారే అవకాశం ఉంది. అంటే ఈ సినిమాను తొలుత మార్చి 18న విడుదల చేస్తామని ఓ తేదీగా చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. పాన్‌ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం అన్ని చోట్లా ఒకే రోజు విడుదల అవ్వాలి. ఇప్పుడు ‘జేమ్స్‌’ కోసం పంపిణీదారులుఈ నిర్ణయం తీసుకోవడంతో… ‘ఆర్‌ఆర్‌ఆర్’కి రెండో డేట్‌.. అదే ఏప్రిల్‌ 28 పక్కా అవుతుందని అంటున్నారు. మరి దీనికి రాజమౌళి అండ్‌ టీమ్‌ ఏం చేస్తుందో చూడాలి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus