Karthi: పాన్‌ ఇండియా ప్లాన్‌ చేస్తే వచ్చేది కాదు: కార్తి

  • October 21, 2022 / 01:54 PM IST

ఓ సినిమాలో పాత్ర ఎంత హిట్‌ అయ్యింది అని తెలియాలి అంటే.. ఆ హీరో ఎక్కడికెళ్లినా ఆ సినిమా గురించే మాట్లాడాలి. ఇలాంటి ఫీల్‌ను రీసెంట్‌గా ఆస్వాదిస్తున్న వాళ్లలో కార్తి ఒకరు. ‘ఖైదీ’ సినిమాలో ఢిల్లీ పాత్ర ఆయనకు అలాంటి ఫీల్‌ ఇచ్చిందట. దీని గురించి ఇటీవల కార్తి చెప్పుకొచ్చారు. ‘ఖైదీ’ సినిమా తన కెరీర్‌లో ఎలాంటి మార్పు తెచ్చిందో చెప్పిన ఆయన.. పాన్‌ ఇండియా సినిమాల గురించి కూడా కామెంట్స్‌ చేశారు.

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమా తర్వాత ‘ఖైదీ 2’ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమా గురించి ఇంతకుమించి ఇంకేం చెప్పలేను. అయితే నేను ఎక్కడికికి వెళ్లినా నా ఢిల్లీ పాత్ర గురించే అడుగుతున్నారు. అంతగా జనాలకు ఈ పాత్ర నచ్చేసింది అని చెప్పారు కార్తి. మొన్నీమధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా ఢిల్లీ గురించే అడిగారు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు కార్తి.

‘సర్దార్‌’ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తారు అని ఆ మధ్య అన్నారు. కానీ ఇప్పుడు ఎందుకు హిందీలో రిలీజ్‌ చేయడం లేదు అని అడిగితే.. ఈ సినిమా ప్రతినాయకుడిగా చేసిన చుంకీ పాండే ‘సర్దార్‌ పాన్‌ ఇండియా సినిమా’ అనే అనేవారు. సినిమా మొదటి రోజు నుండి ఆయన ఈ మాట చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు హిందీలో వేరే సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే వారం తర్వాత అక్కడ ‘సర్దార్‌’ విడుదల చేస్తాం అని చెప్పారు కార్తి.

అయినా పాన్‌ ఇండియా ప్లాన్‌ చేస్తే వచ్చేది కాదు. ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో అదే ఇవ్వాలి. రాజమౌళి ‘బాహుబలి’ని తెలుగు ప్రేక్షకుల కోసం తీశారు. కానీ ఆ సినిమా పాన్‌ వరల్డ్‌ స్థాయికి వెళ్లింది. సినిమా, కాన్సెప్ట్‌ బాగుంటే ఆటోమెటిక్‌గా ఆ సినిమా పాన్‌ ఇండియా ఆడుతుంది అని తనదైన శైలిలో పాన్‌ ఇండియాకు అర్థం చెప్పారు కార్తి.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus