తెలుగు ప్రేక్షకులు కమర్షియల్ మూవీస్ ఎక్కువగా చూస్తుంటారు.అందులో మంచి యాక్షన్ కూడా ఉందంటే… హీరో ఎవరు అనే విషయాన్ని పట్టించుకోకుండా చూస్తారు. మూవీని బంపర్ హిట్ చేస్తారు.అవి డబ్ చేసిన మూవీస్ అయినా సరే బ్రహ్మరథం పడతారు మన తెలుగు ప్రేక్షకులు. అందుకే చాలా మంది కోలీవుడ్ హీరోలు తెలుగులో కూడా క్రేజ్ ను సంపాదించుకున్నారు. అందులో కార్తీ కూడా ఒకడు.
సూర్య తమ్ముడిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కార్తీ.. తక్కువ టైంలోనే తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పక్కింటి కుర్రాడిలా తన నేచురల్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ వస్తున్నాడు. కార్తీ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే ముద్ర తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఉంది. అందుకే అతను నటించిన ప్రతీ సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. అందులో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ ‘సర్ధార్’ ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ అయ్యింది.’అభిమన్యుడు’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని మనకు అందించిన పి.ఎస్.మిత్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. నిజానికి ‘సర్దార్’ అనే టైటిల్ ఎప్పటినుండో ఈ చిత్రం కోసం పరిశీలిస్తున్నారు . అయితే ఈ టైటిల్ విన్న వెంటనే మన తెలుగు ప్రేక్షకులకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సర్ధార్ పాపా రాయుడు’, పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వంటి చిత్రాలను గుర్తుచేస్తాయి. కార్తీ నటించిన ప్రతీ సినిమాకి పాత తెలుగు సినిమా టైటిల్ ను గుర్తుచేసేలా పెట్టుకుంటూ ఉంటాడు. అలా తెలుగు సినిమాలను గుర్తు చేస్తూ వచ్చిన కార్తీ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) కాష్మోరా :
కార్తీ, నయనతార జంటగా నటించిన మూవీ ఇది. ఈ మూవీలో కార్తీ ఓ డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తాడు. తెలుగులో ఈ మూవీ పెద్దగా ఆడలేదు. అయితే ఇదే మూవీ టైటిల్ తో 1986 లో రాజేంద్ర ప్రసాద్, భాను ప్రియా, రాజశేఖర్ నటించిన మూవీ ఒకటి వచ్చింది. ఆ పాత ‘కాష్మోరా’ చూస్తే చాలా భయం వేస్తుంది.
2) చినబాబు :
2018 లో వచ్చిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపించుకుంది. రైతు గొప్పతనాన్ని చెబుతూ ఈ సినిమాలో పలు డైలాగులు కూడా ఉంటాయి. అయితే ‘చినబాబు’ టైటిల్ తోనే 1988లో నాగార్జున, అమల నటించిన ఓ సినిమా వచ్చింది.
3) ఖైదీ :
చిరంజీవిని స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. అదే టైటిల్ ను కార్తీ వాడుకున్నాడు. 2019లో వచ్చిన ‘ఖైదీ’ మూవీ కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో కార్తీ క్రేజ్ ను మరింత పెంచింది.
4) దొంగ :
ఈ టైటిల్ తో కూడా చిరంజీవి నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ఉంది. 2019లో అదే టైటిల్ తో కార్తీ నటించిన మూవీ ఒకటి వచ్చింది. కార్తీ వదిన జ్యోతిక ఈ చిత్రంలో అతనికి అక్క పాత్రని పోషించడం విశేషం.
5) ఖాకి :
తెలుగులో ‘కాకి’ ‘ఖాకీ చొక్కా’ వంటి సినిమాలు గతంలో వచ్చాయి. 2018 లో ‘ఖాకి’ టైటిల్ తో కార్తీ నటించిన సినిమా వచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బాగానే ఆడింది.
6) సుల్తాన్ :
బాలకృష్ణ డబుల్ రోల్ ప్లే చేసిన మూవీ ‘సుల్తాన్’ పేరుతో తెరకెక్కింది. అదే టైటిల్ తో కార్తీ నటించిన సినిమా ఒకటి వచ్చింది. రష్మిక ఈ మూవీలో హీరోయిన్.
7) సర్దార్ :
కార్తీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇది. ఈ టైటిల్ చూడగానే మనకు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘సర్దార్ పాపారాయుడు’, పవన్ కళ్యాణ్ నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రాలు గుర్తుకొస్తాయి.
8) మల్లిగాడు :
కార్తీ నటించిన ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. వీరిద్దరికీ ఈ సినిమాతో నేషనల్ అవార్డులు దక్కాయి. గతంలో ‘మాయదారి మల్లిగాడు’ పేరుతో కృష్ణగారి సినిమా కూడా ఒకటి వచ్చింది.
9) దేవ్ :
కార్తీ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన మూవీ ఇది. తెలుగులో ‘దేవా’ పేరుతో శ్రీహరి హీరోగా ఓ చిత్రం వచ్చింది. ఈ టైటిల్ కాస్త ఆ సినిమాని గుర్తుచేసే విధంగా ఉంటుంది. అంతేకాదు కార్తీ అన్నయ్య సూర్య హీరోగా ‘దేవా’ పేరుతో తెలుగులో ఓ సినిమా వచ్చింది.
10) చెలియా :
గౌతమ్ మీనన్- మాధవన్- అబ్బాస్ కాంబినేషన్లో ‘చెలి’ అనే టైటిల్ తో తెలుగులో ఓ సినిమా వచ్చింది. అదే టైటిల్ ను గుర్తుచేస్తూ కార్తీ- మణిరత్నం ల చెలియా మూవీ వచ్చింది.