HIT 4: ‘హిట్ 4’.. కార్తీ తొందరగా ఛాన్స్ ఇస్తాడా?

నాని (Nani) నిర్మాణంలో ‘హిట్'(హిట్ : ది ఫస్ట్ కేస్) (HIT) , ‘హిట్ 2′(హిట్ ది సెకండ్ కేస్) (HIT 2) , ‘హిట్ 3′(హిట్ ది థర్డ్ కేస్) (HIT 3) సినిమాలు వచ్చాయి. మొదటి భాగంలో విశ్వక్ సేన్(Vishwak Sen) హీరోగా నటించాడు. రెండో భాగంలో అడివి శేష్ (Adivi Sesh)  హీరోగా నటించాడు. మూడో భాగంలో నాని హీరోగా నటించడం జరిగింది. మూడు పార్టులు కూడా కమర్షియల్ గా ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు సూపర్ హిట్ అయ్యాయి. ‘హిట్’ యూనివర్స్ లో మొత్తం 7 కేసులు..

HIT 4

అంటే 7 పార్టులు ఉంటాయని దర్శకుడు శైలేష్, నిర్మాత నాని చెప్పడం జరిగింది. అందుకే ‘హిట్’ రేంజ్ ను అంటే మార్కెట్ ను కూడా పెంచడానికి నాని, శైలేష్ డిసైడ్ అవ్వడం జరిగింది. విశ్వక్ సేన్ తో చేసిన హిట్ రూ.15 కోట్లు, అడివి శేష్ తో చేసిన హిట్ 2 రూ.30 కోట్లు, నాని తో చేసిన ‘హిట్ 3’ రూ.100 కోట్లు.. ఇలా హిట్ రేంజ్ ను సైలెంట్ గా పెంచుకుంటున్నారు. ‘హిట్ 4’ కి (HIT 4) రూ.200 కోట్ల టార్గెట్ పెట్టుకున్నారు. అందుకే హీరోగా ‘కార్తీ’ ని (Karthi) తీసుకున్నారు.

తమిళంలో ‘కార్తీ’ కి రూ.100 కోట్ల పైనే మార్కెట్ ఉంది. తెలుగులో కూడా కార్తీ సినిమాలు బాగా ఆడతాయి. ‘హిట్’ సీక్వెల్స్ కు ఉన్న క్రేజ్ ను బట్టి చూసుకున్నా.. తెలుగులో రూ.50 కోట్లు థియేట్రికల్ చేసినా.. నాన్ థియేట్రికల్ రూపంలో ఇంకో రూ.50 ఈజీగానే రికవరీ అవుతుంది. సో ‘హిట్ 4’ కి రూ.200 కోట్ల మార్కెట్ ఉన్నట్టే. కాకపోతే ఒక్కటే సమస్య.

అది హీరో కార్తీతో..! ఎందుకంటే కార్తీ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ పక్క కార్తీ ‘సర్దార్’ సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతూనే మరోపక్క ‘వా వాతియార్’ అనే సినిమా కూడా చేస్తున్నాడు. అలాగే ‘ఖైదీ 2’ ని కూడా త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. కాబట్టి.. ఇప్పట్లో అతను ‘హిట్ 4’ కి డేట్స్ ఇచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి.

అప్పట్లో మెగాస్టార్ రేంజ్ అది…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus