మా టీవీలో సోమవారం నుండీ శనివారం వరకూ సాయంత్రం 7:30 గంటలకు టెలికాస్ట్ అయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొత్త సినిమాలు ఎన్ని టెలికాస్ట్ చేసినా రాని టి.ఆర్.పి రేటింగ్ ఈ సీరియల్ కు వస్తుండడం కూడా ఓ రికార్డు అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా..సెప్టెంబర్ 19 నుండీ ఐ.పి.యల్ 13వ సీజన్ మ్యాచ్‌లు కూడా సరిగ్గా సాయంత్రం 7:30 గంటలకే ప్రారంభం కానున్నాయి. దీంతో ‘కార్తీకదీపం’ సీరియల్ ఫ్యాన్స్ కు ఇబ్బంది తప్పేలా లేదు.
అందుకే ఐ.పి.యల్ టైమింగ్‌ను మార్చాలంటూ సూర్యపేటకు చెందిన పవిత్రపు శివచరణ్ అనే వ్యక్తి సెప్టెంబర్ 3న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి అలాగే చెన్నై ఐపీఎల్ టీమ్, ‘స్టార్ మా’ వారిని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్ చేసాడు. ఐ.పి.యల్ మ్యాచ్‌లని ఎలాగైనా రాత్రి 8 గంటలకు మార్చమని కూడా అతను కోరాడు.ఈ నేపథ్యంలో శివచరణ్ ట్వీట్‌కు స్టార్ మావారు మద్దతు పలుకుతూ … ‘శివచరణ్ కోరింది సబబే కదా’ అంటూ స్పందించారు.
ఇక శివ చరణ్ ట్వీట్ గురించి తెలుసుకున్న ‘కార్తీకదీపం’ సీరియల్ హీరోయిన్ వంటలక్క అలియాస్ దీప అలియాస్ ప్రీమి విశ్వనాథ్ దృష్టికి చేరింది. ‘తన సీరియల్‌ను ఇంతలా అభిమానించే వాళ్లు ఉన్నారా’ అని ఆశ్చర్యపోయిన ఆమె.. సీరియల్ అభిమానికి 32 ఇంచెస్ టీవీని కొనిపెట్టింది. అంతేకాదు శివ చరణ్‌ను అభినందిస్తూ ఓ ఉత్తరాన్ని కూడా రాసి పంపింది. ఇప్పుడు శివ చరణ్ హ్యాపీ.ఎందుకంటే.. ఓ పక్క ‘కార్తీక దీపం’ సీరియల్ కు.. అలాగే క్రికెట్ మ్యాచ్‌కు ఆటంకం ఉండదు కదా.!