టీవీ సీరియల్ హీరోకి మామిడి పళ్ళు పంపిన పవన్…!
- October 22, 2019 / 11:57 AM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ గా గడుపుతున్నాడు. ఇందుకోసం సినిమాలకి కూడా దూరంగా ఉంటూ వస్తున్నాడు. ఇది పక్కన పెడితే.. పవన్ కు ఓ మామిడి తోట ఉంది. ప్రతీ ఏడాది ఈ తోట నుండీ కొందరి ప్రముఖుల ఇంటికి.. మామిడి పళ్ళు వెళ్తుంటాయి. త్రివిక్రమ్, నితిన్ వంటి వారికి ప్రతీ ఏడాది మామిడి పళ్ళు వెళ్తుంటాయి.

ఈ ఏడాది ‘కార్తిక దీపం’ సీరియల్ హీరో నిరుపమ్ కు పవన్ తోట నుండీ మామిడి పళ్ళు వెళ్ళాయి. అయితే ఇవి పంపింది..పవన్ కళ్యాణ్ కాదు తల్లి అంజనా దేవి గారు అని తెలిసింది. ‘కార్తికదీపం’ సీరియల్ లో నిరుపమ్ నటన బాగుంది అని .. పవన్ మామిడి తోటలోని పళ్ళను పంపిందట. ఈ విషయాన్ని ఈ మధ్యే ‘మా పరివార్ అవార్డు’ వేడుకల్లో .. నిరుపమ్ చెప్పుకొచ్చాడు.
రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













