‘కార్తీక దీపం’ క్లైమాక్స్ కు వచ్చేసినట్టే.. కానీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూసే..!

‘కార్తీక దీపం’ సీరియల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు అనుకుంట. సోమవారం నుండీ శనివారం వరకూ ‘స్టార్ మా’ లో సాయంత్రం 7:30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ సీరియల్.. కోసం ఇంటి పనులను 7 గంటలకే ఫినిష్ చేసుకుని కూర్చుంటారు గృహిణులు. ఒకవేళ పనులు అవ్వకపోయినా.. చూసే వీలు లేకపోయినా ఈ సీరియల్ పెట్టుకుని ఆ టైములో వింటూ పనులు చేసుకుంటూ ఉంటారు. ఇక హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు అయితే ఉదయాన్నే చూసేస్తుంటారు.

ఇక సోషల్ మీడియాలో ఈ సీరియల్ పై వచ్చే మీమ్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. 2017 వ సంవత్సరం సెకండ్ హాఫ్ లో మొదలైన ఈ సీరియల్ ఇప్పటికీ హైయెస్ట్ టి.ఆర్.పి లను నమోదు చేస్తూ విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఇప్పటికి 995 ఎపిసోడ్లు అయ్యాయి.అయితే ఇప్పుడు ఈ సీరియల్ క్లైమాక్స్ కు వచ్చినట్టు ఇన్సైడ్ టాక్. దీప అలియాస్ వంటలక్క ను అనుమానించి దూరం పెట్టిన డాక్టర్ బాబు.. తనకు పిల్లలు కలిగే భాగ్యం ఉందని తెలుసుకుని ..

దీపని క్షమించమని కోరడానికి బయల్దేరుతాడట. కానీ చివర్లో వంటలక్క ప్రాణాలు కోల్పోతుందని తెలుస్తుంది. చివరికి పిల్లలు అయిన హిమ,శౌర్య లు తన తండ్రి వద్దకు చేరుతారని.. విలన్ మౌనిత సూసైడ్ చేసుకుని ప్రాణాలు తీసుకుంటుంది అని తెలుస్తుంది. అయితే ఇదంతా మరో 400ల ఎపిసోడ్లు పైనే ఉంటుందట. కాబట్టి.. ఈ ఏడాది ‘కార్తీక దీపం’ ఫినిష్ అవ్వదు లెండి. అయితే వంటలక్క పాత్ర కనుక ప్రాణాలు కోల్పోతే.. తెలుగు రాష్ట్రాల్లోని జనాలు ఏడ్చేస్తారేమో. దాని పైన ఎన్ని మీమ్స్ వస్తాయో..!

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus