Karthikeya 2: న్యూ జెర్సీ ఎడిసన్ మేయర్ చేతులకు గౌరవ ప్రశంసా పత్రం అందుకున్న నిఖిల్?

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ 2. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమా ఇప్పటికే ఎంతోమంది ప్రశంసలను అందుకుంది.

ఇక ఈ సినిమా ఏకంగా 130 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సంచలనాలను సృష్టించింది. అదేవిధంగా ఈ సినిమా ఎన్నో ప్రశంసలను కూడా అందుకుంది. ఇకపోతే తాజాగా కార్తికేయ2 సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది. ఈ సినిమా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా అమెరికాలో కూడా ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకోవడంతో న్యూ జెర్సీ ఎడిసన్ మేయర్ ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా వర్ణిస్తూ హీరో నిఖిల్ కు గౌరవ పత్రం అందజేస్తూ అభినందించారు.

నిఖిల్ కార్తికేయ 2 లో ఎంతో అద్భుతమైన నటనని కనబరిచారని కొనియాడారు. ఇలా ప్రశంసా పత్రాన్ని అందుకోవడంతో నిఖిల్ ఇందుకు సంబంధించిన వీడియోని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ.. ఇలాంటి గౌరవం అందుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ జంటగా 18 పేజీస్ అనే లవ్ అండ్ రొమాంటిక్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా త్వరలోనే విడుదల కానుంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus