Karthikeya 2 Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసిన ‘కార్తికేయ2’..!

నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ద్వారకా నగరం బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ మూవీ… ‘కార్తికేయ’ చిత్రంలో లానే ఎన్నో ట్విస్ట్ లతో రూపొందింది. మొదటి రోజు ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ కే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించింది.

రోజు రోజుకీ ఈ చిత్రానికి ఆదరణ పెరుగుతూనే ఉంది.హిందీలో కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 4.97 cr
సీడెడ్ 2.12 cr
ఉత్తరాంధ్ర 1.76 cr
ఈస్ట్ 1.16 cr
వెస్ట్ 0.83 cr
గుంటూరు 1.32 cr
కృష్ణా 1.03 cr
నెల్లూరు 0.47 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 13.66 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.02 cr
ఓవర్సీస్ 2.65 cr
హిందీ మరియు ఇతర వెర్షన్లు 1.10 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 18.43 cr

కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.18.43 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసింది.

మంగళవారం రోజు కూడా ఈ మూవీ సూపర్ గా కలెక్ట్ చేసింది. ముఖ్యంగా హిందీలో అయితే చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. నిన్న అక్కడ మరిన్ని ఈ స్క్రీన్స్ యాడ్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus