Karthikeya 2 Trailer: ‘కార్తికేయ’ ని మించిన ట్విస్ట్ లు ఉన్నట్టున్నాయిగా..!

2014 లో నిఖిల్,స్వాతి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ‘కార్తికేయ2’ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే రివీల్ చేశారు. కానీ బడ్జెట్ సమస్యల కారణంగా అది ఆలస్యం అవుతూ వచ్చింది. మొత్తానికి అభిషేక్ అగర్వాల్, టి.జి.విశ్వప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారు. మొదట జూలై 22న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించి,అటు తర్వాత ఆగస్టు 12 కి మారింది.

చివరికి ఆగస్టు 13న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఓ ట్రైలర్ ను విడుదల చేశారు. కాగా ఇప్పుడు మరో ట్రైలర్ ను విడుదల చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచారు. మొదటి ట్రైలర్లో ద్వారకా నగరం రహస్యమేంటి? అనే పాయింట్ ను చూపించారు. ‘కార్తికేయ’ కి ఏమాత్రం సంబంధం లేని విధంగా ‘కార్తికేయ2’ మొదటి ట్రైలర్ ఉంది. అయితే తాజాగా రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్లో ‘కార్తికేయ’ చిత్రం ఎండింగ్ తర్వాత మొదలైన పరిస్థితిని చూపించారు.

ఓ మొక్కు నిమిత్తం కార్తికేయ కుటుంబం ద్వారకా వెళ్లడం అక్కడ జరిగే వింత పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు స్పష్టమవుతుంది. మొదటి పార్ట్ లో హీరో మెడిసిన్ స్టూడెంట్ గా కనిపిస్తాడు.. ఇందులో డాక్టర్ అయిపోయాడు. ఈ చిత్రంలో స్వాతి పాత్రని ఎలా సైడ్ చేశారు అనేది మరో ఆసక్తికర అంశం.

శ్రీకృష్ణుడి చరిత్రతో, ద్వారకా నగరి నేపథ్యంతో కార్తికేయకు సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తి కలిగించే అంశం. ‘కార్తికేయ’ ని మించిన ట్విస్ట్ లు ‘కార్తికేయ2’ లో ఉంటాయనే హింట్ కూడా ఈ ట్రైలర్ ఇచ్చింది. విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. కాలభైరవ అందించిన నేపధ్య సంగీతం కూడా బాగుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!


సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus