Karthikeya: ‘ఆస్కార్’ ఖర్చు ఎంతంటే… అసలు లెక్క చెప్పేసిన కార్తికేయ!

  • March 27, 2023 / 01:39 PM IST

‘ఆర్‌ఆర్ఆర్‌’ సినిమా టీమ్‌ ‘ఆస్కార్‌’ కోసం రూ. 80 కోట్లు ఖర్చ పెట్టింది.. గత కొన్ని రోజులుగా ఈ మాట చుట్టూ చర్చ నడుస్తోంది. అంత ఖర్చ పెట్టి ఆస్కార్‌ సంపాదించారా అని కొంతమంది అంటుంటే, దేశానికి ఖ్యాతి తెచ్చిన సినిమాను ఆస్కార్‌కు డైరెక్ట్‌గా పంపకపోవడం వల్ల నేరుగా టీమ్‌ కష్టపడింది. ఈ క్రమంలో డబ్బులు ఖర్చు అయి ఉంటాయి. ప్రచారం కోసం అవుతాయి కదా అని అంటున్నారు. అయితే నిజానికి ఈ సినిమా ఆస్కార్‌ ప్రచారం కోసం ఎంత ఖర్చయింది. ఈ విషయాన్ని సినిమా లైన్‌ ప్రొడ్యూస్‌ కార్తికేయ చెప్పాడు. అందరూ అనుకుంటున్నట్లుగా కాకుండా.. ఎంత ఖర్చయ్యిందో చెప్పాడు.

‘ఆర్‌ఆర్‌ఆర్’కు భారతదేశం నుంచి అధికారికంగా ఆస్కార్‌ ఎంట్రీ రాకపోయినప్పుడు కాస్త బాధగా అనిపించింది అని చెప్పిన కార్తికేయ (Karthikeya) .. పంపి ఉంటే ఇంకాస్త బలంగా ఉండేది అని అభిప్రాయపడ్డారు. ‘ఆస్కార్‌ కోసం ప్రచారం చేస్తునప్పుడు రకరకాల వార్తలు వచ్చాయి. బాగా డబ్బు ఖర్చు చేశారని కొందరు, ఆస్కార్‌ టీమ్‌ను కొనేశారని ఇంకొందరు, ఆస్కార్‌ టికెట్ల కోసం ఎక్కువ ఖర్చు పెట్టారని మరికొందరు అంటున్నట్లు వార్తల్లో చదివాను. అయితే అదంతా అబద్దం అని చెప్పారు కార్తికేయ.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, ప్రేమ్‌రక్షిత్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవను ఆస్కార్‌ కమిటీ ఆహ్వానించింది. కీరవాణి, చంద్రబోస్‌ నామినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కమిటీ పిలిచిన వాళ్లు, నామినేషన్స్‌లో ఉన్న వాళ్లు తప్పితే మిగిలిన అందరూ టికెట్‌ కొనుక్కుని ఆస్కార్‌ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉంటుంది. దీని కోసం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు ఆస్కార్‌ కమిటీకి మెయిల్‌ చేయాలి. దాన్ని వారు అనుమతిస్తే.. ఓ లింక్‌ పంపిస్తారు. దాని ద్వారా టికెట్లు కొనుక్కోవలి. అలా మేం ఒక్కో టికెట్‌కు 1500 డాలర్లు పెట్టి కొన్నాం. మరో నలుగురి కోసం 750 డాలర్లు పెట్టి తీసుకున్నాం అని చెప్పారు కార్తికేయ.

ఆస్కార్‌ కోసం బాగా ప్రచారం చేయాలనుకున్నాం. డబ్బులు ఇస్తే ఆస్కార్‌ కొనుకోవచ్చన్నది పెద్ద జోక్‌. అక్కడ ప్రతి విషయానికి ఒక ప్రాసెస్‌ ఉంటుంది. అయినా ఆడియన్స్‌ ప్రేమను కొనగలమా? అని ప్రశ్నించారు. ఆస్కార్‌ ప్రచారం చేయడం కోసం హాలీవుడ్‌ సినిమాలు కొన్ని స్టూడియోలను ఆశ్రయిస్తాయి. అయితే మాకు అలాంటి అవకాశం లేదు. దీంతో క్యాంపెన్‌ కోసం బడ్జెట్‌ రూ.5 కోట్లు అనుకుని స్టార్ట్‌ చేశాం. మొదటి ఫేజ్‌లో రూ.3 కోట్లు ఖర్చు చేశాం. నామినేషన్స్‌ వచ్చిన తర్వాత కొంత బడ్జెట్‌ పెంచాం. అలా మొత్తం ప్రచార పర్వానికి ఓ ఐదారు కోట్ల రూపాయాలు సరిపోతాయనుకున్నాం. కానీ ఆ లెక్క చివరకు రూ.ఎనిమిదన్నర కోట్లు అయింది అని కార్తికేయ చెప్పారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus