సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నవాళ్లనే సడన్ గా విలన్ రోల్ చేయమని అడిగితే.. “హీరోగా ట్రై చేస్తున్నా.. ఇప్పుడు విలన్ అంటే కష్టమేమో” అని ఏవేవో కారణాలు చెబుతుంటారు. అలాంటిది “ఆర్.ఎక్స్ 100” సినిమాతో హీరోగా సూపర్ హిట్ కొట్టడమే కాక ఊహించని స్టార్ డమ్ సంపాదించుకున్న కార్తికేయ గుమ్మకొండ మాత్రం హీరోగా కెరీర్ ను కంటిన్యూ చేస్తూనే మరోపక్క విలన్ గా, క్యారెక్టర్స్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మనోడు ఆల్రెడీ నాని కథానాయకుడిగా రూపొందుతున్న “గ్యాంగ్ లీడర్” చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా కార్తికేయ మరో సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించేందుకు అంగీకరించాడని వినికిడి. నాగచైతన్య కథానాయకుడిగా ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహాసముద్రం అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కార్తికేయ ఓ కీలకపాత్ర పోషించనున్నాడట. ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది.