“చార్జ్……” అంటూ వస్తున్న ‘కార్తీ’

`ఖాకి` సినిమా ఎలా ఉండ‌బోతోందా? అనే స‌ర్వ‌త్రా ఆస‌క్తి మొద‌లైంది. ఆ ఆస‌క్తిని `ఖాకి` ట్రైల‌ర్ ఉత్కంఠ‌గా మారుస్తోంది. ప్ర‌తి షాట్ నూ ప్రేక్ష‌కుడు ఊపిరి బిగ‌బ‌ట్టి చూసేలా తెర‌కెక్కించిన విష‌యం ట్రైల‌ర్‌ను చూస్తేనే అర్థ‌మ‌వుతోంది. స‌మాజానికి న్యాయం చేయాల‌నుకుంటున్న ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఈ సినిమాలో ఉంటార‌ని అర్థ‌మ‌వుతోంది. త‌ను న‌మ్మిన దానికోసం ఎంత‌టివారినైనా ప్ర‌శ్నించే అత‌ని గుణం క‌నిపిస్తోంది. మిగిలిన అంద‌రు పోలీసుల్లాగే త‌న భ‌ర్త ఎందుకు ఉండ‌ట్లేద‌ని, ట్రాన్స్‌ఫ‌ర్ల‌తో విసిగిపోయిన నిజాయ‌తీగ‌ల పోలీస్ ఆఫీస‌ర్ భార్య స్వ‌రం వినిపిస్తోంది. అంద‌మైన జంట రొమాన్స్ క‌నిపిస్తోంది. అన్నిటికీ మించి ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ మిషన్ క‌నిపిస్తోంది.

కార్తి, ర‌కుల్ ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన చిత్రం `ఖాకి`. హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆదిత్యమ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తున్నారు. 17న విడుద‌ల కానున్న ఈ సినిమా ట్రైల‌ర్ జ‌న‌రంజ‌కంగా ఉంది. “ప‌వ‌ర్‌లో ఉన్నోడి ప్రాణానికి ఇచ్చే విలువ ప‌బ్లిక్ ప్రాణానికి ఎందుకు ఇవ్వ‌రు సార్‌?`, `మ‌నం చెడ్డ వాళ్ల నుండి మంచి వాళ్ల‌ని కాపాడే పోలీస్ ఉద్యోగం చేయ‌ట్లేదు సార్‌, మంచి వాళ్ల నుంచి చెడ్డ వాళ్ల‌ని కాపాడే చెంచా ఉద్యోగం చేస్తున్నాం` వంటి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగులు వింటుంటే రోమాలు నిక్క‌బొడుచుకుంటున్నాయి. సినిమాను మార్నింగ్ షోలోనే చూసేయాల‌న్నంత ఊపు క‌లుగుతోంది. కార్తి, ర‌కుల్ మ‌ధ్య చూపించిన డైలాగులు, ఇంటిమ‌సీ షాట్‌లు ఫ్యామిలీ ఆడియ‌న్స్ ని థియేట‌ర్ల వైపు క్యూ క‌ట్టిస్తాయ‌ని అన‌డంలో కించిత్తు అనుమానం కూడా లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus