Kartik Aaryan: అలా వైకుంటపురం రీమేక్ పై స్పందించిన కార్తీక్ ఆర్యన్!

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం అలా వైకుంఠపురం. ఈ సినిమా తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా ద్వారా నిర్మాతలు భారీగానే లాభ పొందారు.ఇలా తెలుగులో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమాని పలు భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. ఇక ఈ సినిమా హిందీ భాషలో కూడా విడుదలైంది.

ఈ సినిమా హిందీలో కూడా డబ్ అయ్యి విడుదలైనప్పటికీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాత్రం ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో షెహజాదా పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో డిజాస్టర్ గా నిలిచింది. అప్పటికే బాలీవుడ్ డబ్బింగ్లో ఈ సినిమాని బాలీవుడ్ ప్రేక్షకులు అందరూ చూశారు. అలాంటి తరుణంలో ఈ సినిమా కోసం డబ్బు ఖర్చు చేసి చూడాలని ఎవరు అనుకోలేదు.

ఇలా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా నటుడు (Kartik Aaryan) కార్తీక్ ఆర్యన్ సినీ కెరియర్ లోనే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక నిర్మాత అల్లు అరవింద్ కి కూడా ఈ సినిమా నష్టాలను తీసుకువచ్చింది.అయితే తాజాగా నటుడు కార్తీక్ ఆర్యన్ ఈ సినిమా రిజల్ట్ పై రియాక్ట్ అవుతూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా కార్తీక్ ఆర్యన్ మాట్లాడుతూ ఇకపై తాను తన కెరియర్లో రీమేక్ సినిమాల జోలికి ఫోనని తెలిపారు.

రీమేక్ సినిమాలు చేయటం వల్ల రిజల్ట్స్ ఎలా ఉంటాయో తనకు ఇప్పుడు తెలిసి వచ్చిందని తెలిపారు. అయితే ఈ సినిమా చేసే సమయంలో ఆల్రెడీ హిందీలో డబ్బింగ్ అయిన సినిమాని ఎవరు చూస్తారు అన్న సందేహం తనలో కలగలేదని సినిమా విడుదలైన తర్వాత ఆ విషయంలో కళ్ళు తెరుచుకున్నానని తెలిపారు.ఇప్పటికి తన వద్దకు రీమేక్ సినిమాల కథలతో తన వద్దకు వస్తున్నారని,తాను మాత్రం ఇకపై రీమేక్ సినిమాల జోలికి పోనని ఇదే తన ఫస్ట్ అలాగే లాస్ట్ రీమేక్ సినిమా అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus