బాలీవుడ్ నటి పూనమ్ పాండే మరణించింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈమె 32 సంవత్సరాల వయసులోనే సర్వైకల్ క్యాన్సర్ తో బాధపడుతూ మరణించినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ వైరల్ గా మారడంతో నిజంగానే ఈమె చనిపోయిందని అందరూ భావించారు. ఈ విధంగా పూనమ్ పాండే మరణించారనే వార్త తెలియగానే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేశారు.
ఈ విధంగా ఈమె గురించి సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు వస్తున్నటువంటి తరుణంలో పూనమ్ మరుసటి రోజు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు. తాను ఎలాంటి క్యాన్సర్ తో బాధపడుతూ మరణించలేదని తాను బ్రతికే ఉన్నాను అంటూ ఈమె తెలిపారు. అంతేకాకుండా తాను అలాంటి పోస్ట్ చేయడానికి కారణం లేకపోలేదు అంటూ ఈమె కారణాన్ని కూడా తెలిపారు.
మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన తీసుకురావడం కోసమే తాను ఈ పని చేశానని ఈమె తెలిపారు. దీంతో నేటిజన్స్ ఇతర సినీ సెలబ్రిటీలు ఈమె వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తనపై చర్యలు కూడా తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం పై తాజాగా నటి కస్తూరి శంకర్ కూడా స్పందించారు. పూనమ్ తన వయసు 32 సంవత్సరాలు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది.
ఇది ఫేక్ న్యూస్ కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి న్యూస్ వైరల్ చేశారు అంటూ (Kasthuri Shankar) ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సర్వైకల్ క్యాన్సర్ గురించి పూర్తిగా తెలుసు. దానికి కారణంగా ఏం జరుగుతుందనేది తెలుసు. పూనమ్ కేవలం ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అలా చేసిందని తెలిసింది. కానీ క్యాన్సర్ జబ్బును ఇలా పబ్లిసిటి స్టంట్ కోసం ఉపయోగించడం నిజంగా సిగ్గుచేటు అంటూ ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.