పాపులర్ టీవీ యాంకర్, బిగ్ బాస్ సీజన్ 1 కంటెస్టెంట్ కత్తి కార్తీక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతుంది. రీసెంట్ గా ఆమె తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్యాంపైన్ కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తన ఆసక్తిని కనబరుస్తూ అతడితో చర్చించింది. ఈ క్రమంలో మధు యాష్కీ ఆమెని సాదరంగా ఆమెని ఆహ్వానించారు. రెండేళ్లుగా కత్తి కార్తీక తన పొలిటికల్ కెరీర్ ను బిల్డ్ చేసుకోవాలనుకుంటుంది.
కానీ వర్కవుట్ అవ్వడం లేదు. 2020 నవంబర్ దుబ్బాక బై ఎలెక్షన్స్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేసింది. ప్రచార కార్యక్రమాల కోసం బాగానే కష్టపడింది. కానీ దారుణంగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఈ క్రమంలో సొంతంగా రాజకీయం చేయడం కంటే ఒక పార్టీ సపోర్ట్ ఉంటే మంచిదని భావించిన ఆమె కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకుంది. త్వరలోనే ఆమె రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ఇప్పుడు కత్తి కార్తీక కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో తెలంగాణ రాజకీయాల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టీఆర్ఎస్ కీలకనేత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కు కత్తి కార్తీక బంధువు అవుతారు.