ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ నిన్న సాయంత్రం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. కత్తి మహేష్ రెండు కోరికలు తీరకుండానే చనిపోయారని సమాచారం. కొన్ని రోజుల క్రితం విజయవాడ నుంచి పీలేరుకు వెళుతున్న సమయంలో కత్తి మహేష్ కారు ఎదురుగా వెళుతున్న లారీని ఢీ కొనడంతో ఆయన ముఖానికి బలమైన గాయాలయ్యాయి. ప్రమాదంలో కత్తి మహేష్ కళ్లు దెబ్బ తిన్నాయని వార్తలు వచ్చాయి.
ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కత్తి మహేష్ వైద్య చికిత్స కొరకు ఏకంగా 17 లక్షల రూపాయలు విడుదల చేసింది. వైసీపీ మద్దతుదారునిగా ఉన్న కత్తి మహేష్ రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారని సమాచారం. గతంలో కత్తి మహేష్ వైసీపీ నుంచి పోటీ చేయాలని అనుకున్నా ఆర్థికంగా బలవంతుడు కాకపోవడంతో ఆయనకు టికెట్ దక్కలేదని తెలుస్తోంది. ఎప్పటికైనా రాజకీయాల్లో సక్సెస్ కావాలని అనుకున్న కత్తి మహేష్ ఆ కోరిక తీరకుండానే చనిపోయారు.
కత్తి మహేష్ సినిమాల్లో నటుడిగా ఓ రేంజ్ కు వెళ్లాలని భావించడంతో పాటు ఎప్పటికైనా మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ సాధించాలని భావించారు. అయితే ఆ కోరిక కూడా తీరకుండానే కత్తి మహేష్ కన్నుమూశారు. కత్తి మహేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన పెసరెట్టు, ఎగిసే తారాజువ్వలు సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోవడం గమనార్హం. అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన కత్తి మహేష్ కాంట్రవర్సీలతో, కామెంట్లతో ఎంజాయ్ చేసేది ఏమీ ఉండదని అది అనవసరపు అటెన్షన్ అని గతంలో చెప్పుకొచ్చారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</str