Kathi Mahesh: గాయాలు పాలైన కత్తి మహేష్.. కంటికి ఆపరేషన్..!
- June 26, 2021 / 01:53 PM ISTByFilmy Focus
ప్రముఖ సినీ నటుడు మరియు విశ్లేషకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్, దర్శకుడు అయిన కత్తి మహేష్ కారుకి యాక్సిడెంట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఆయన గాయాల పాలయ్యాడు.వివరాల్లోకి వెళితే… కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయరహదారి పై ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ క్రమంలో కత్తి మహేష్ కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది.
వెంటనే ఎయిర్ బ్యాగ్స్ తెరచుకోవడంతో కత్తి మహేశ్ స్వల్పగాయాలతో బయటపడ్డారు అని కొంతమంది చెబుతున్నా.. మరోపక్క ఆయన కంటికి ఆపరేషన్ అయినట్టు కూడా కొంతమంది చెబుతున్నారు. నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కత్తి మహేష్ ను అడ్మిట్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే కత్తి మహేష్ ఓ సారి నగర భహిష్కరణకు కూడా గురయ్యారు.

ఈయన పై కొంతమంది దాడులు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను ఈయన కెలకడంతో వాళ్ళు ఈయన పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇక కత్తి మహేష్ పెసరట్టు అనే చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి కూడా తెలిసిందే.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!















