మీడియా పై కత్రినా కైఫ్ ఫైర్

మీర్జాపూర్ యువ రాణిగా “మల్లేశ్వరి” సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ ఈ మధ్య మూడీగా ఉంటోంది. ఆమె నటించిన సినిమాలు విజయం సాధిస్తున్నా, చేతి నిండా ఆఫర్లు ఉన్నా ప్రశాంతంగా ఉండలేక పోతోంది. కారణం ఏంటని ఆరాదీస్తే.. ఆమె బాధకి కారణం మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ అని తేలింది. కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ తో బ్రేక్ అప్ చెప్పినప్పటి నుంచి సంతోషంగా ఉండలేక పోతోందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినీ షూటింగ్ లో సహా నటులతో ప్రేమలో పడడం, కొంత కాలంగా ప్రేమ పక్షుల్లా తిరగడం, ఆ తర్వాత విడిపోవడం బాలీవుడ్ లో సర్వ సాధారణం. విడిపోయిన పక్షులు వేరే జంట వెతుక్కోవడం మామూలే. కానీ కత్రినా కైఫ్ రణబీర్ కపూర్ కి కటాఫ్ చెప్పిన వదిలి ఉండలేక పోతోంది. అతను ఎవరెవరితో స్నేహం చేస్తున్నాడో తెలుసుకొని మండిపోతోంది. అంతవరకు బాగానే ఉంది. ప్రియుడిపై కోపాన్ని మీడియాపై చూపిస్తుండడమే చిక్కులు తెచ్చిపెడుతోంది.

ఈ మధ్య కత్రినా మీడియా కనిపిస్తే చాలు ఆమెకు పట్టరాని కోపం వచ్చేస్తోంది. తాజాగా సినిమా షూటింగ్ నిమిత్తం మొరాకో వెళ్లిన కత్రినా తిరిగి వస్తూ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. ఇండియాకు వచ్చిందన్న వార్త తెలిసిన మీడియా ఆమెను కలిసేందుకు వెళ్లింది. ఆమె వేగంగా తన కారు వద్దకు వెళ్ళింది. ఓ రిపోర్టర్
కారు వద్దకు వెళ్లి “సినిమా గురించి ఏమైనా సమాచారం చెబుతారా” అని అడిగాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారంటూ వారిపై మండిపడింది. ఊహించని ఎదురుదాడికి రిపోర్టర్ అవాక్ అయ్యాడు. ఆగ్రహం వెనుక కారణం తెలుసుకుని విస్తుపోయాడు.
మాజీ బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో కలిసి లేటెస్ట్ మూవీ ‘జగ్గా జాసూస్’లో కత్రినా మళ్లీ జతకట్టనుంది. రణబీర్ విషయంపై అడుగుతారేమోనని భావించిన కత్రినా తానే మీడియాపై ఎదురుదాడికి దిగిందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus