Kaushal: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు మద్దతుగా కౌశల్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్లో విన్నర్ అయినప్పటికీ పెద్ద ఎత్తున వివాదాలలో నిలిచారు. తాను కప్పు గెలుచుకోవడానికి సహకరించినటువంటి అభిమానులను కలవడం కోసం ఈయన బయటకు వచ్చారు. అయితే అభిమానుల కారణంగా పల్లవి ప్రశాంత్ కేసులో ఇరుక్కోవడం జైలు పాలు కావడం వంటివి కూడా జరిగాయి. రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ఈయన అనంతరం బయటకు వచ్చారు. ప్రశాంత్ అరెస్టు కావడంతో ఎంతో మంది సెలబ్రిటీలు ఈయన అరెస్టు గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ (Kaushal) తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్టు గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ ఒక రైతుబిడ్డ అనే సింపతి ఉన్నప్పటికీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోవడంతోనే తనని అరెస్టు చేశారు అంటూ ఈయన అభిప్రాయపడ్డారు. పోలీసులకు ప్రశాంత్ మధ్య ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు. అయితే ఆయనని టార్గెట్ చేశారు. అయితే ప్రశాంత్ ను టార్గెట్ చేశారన్న సందేహాలు కలుగుతున్నాయని తెలిపారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఆర్మీలు ఏర్పడడం అనేవి సీజన్ 2 నా వల్లనే జరిగాయని అప్పుడు ట్రైలర్ చూపించగా సీజన్ సెవెన్ తో సినిమానే చూపించారు అంటూ కౌశల్ తెలిపారు. ఇక కప్పు గెలుచుకున్న తర్వాత వెనుక నుంచి వెళ్లిపోవాలని భావించినప్పటికీ తనను గెలిపించినటువంటి అభిమానులను కలవాలనీ మనసు లాగుతూ ఉంటుంది

అందుకే ఇలా గొడవలు చోటు చేసుకున్నాయని, తన అభిప్రాయం ప్రకారం ఇలాంటి కార్యక్రమాలు సిటీ మధ్యలో కాకుండా సిటీ బయట పెడితే బాగుంటుంది అంటూ ఈ సందర్భంగా కౌశల్ పల్లవి ప్రశాంత్ పట్ల మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus