Kavya Kalyanram: సినిమా ఫ్లాప్ అయితే వేరేలా ట్రీట్ చేస్తారు!

కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ సందడి చేస్తున్నారు. అయితే ఈమెకు బలగం సినిమా మాత్రం ఎంతో మంచి సక్సెస్ అందించింది. ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే నటుడు శ్రీ సింహతో కలిసి ఉస్తాద్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కావ్య నటుడు ప్రియదర్శి అలాగే శ్రీ సింహతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సినీ కెరియర్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ కావ్య కళ్యాణ్ రామ్ ది లక్కీ హ్యాండ్ అని ఆమెను లక్కీ లెగ్ అంటూ మాట్లాడారు. సాధారణంగా వరుసగా రెండు సినిమాలు హిట్ అయితే ఆమెను లక్కీ హీరోయిన్ అంటూ అభివర్ణిస్తూ ఉంటారు

ఈ క్రమంలోనే కావ్య (Kavya Kalyanram) సైతం లక్కీ హీరోయిన్ అంటూ ప్రియదర్శి మాట్లాడారు దీంతో ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో రెండు సినిమాలు హిట్ అయితే లక్కీ లెగ్ అంటారు కానీ ప్లాప్ అయితే వాళ్లే ఐరన్ లెగ్ అని కూడా అంటారని తెలియజేశారు.ఏదో సినిమా చేస్తున్నామంటే చేస్తున్నామని కాకుండా హిట్ పడితే ఒకలాగా ఫ్లాప్ పడితే మరోలాగా ట్రీట్ చేస్తారని తెలిపారు. రెండు సినిమాలు హిట్ అయి ఒక సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరోయిన్లను మరోలా ట్రీట్ చేస్తారని ఈమె తెలిపారు.

అందుకే కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే తాను ఎంపిక చేసుకుంటూ సినిమాలలో నటిస్తున్నానని తెలిపారు. ఇక ఈమె తెలుగు అమ్మాయి కావడంతో ఎలాంటి సీన్లు అయినా అలాగే ఇమిడిపోయి నటించగలరని చెప్పాలి.ఇలా బలగం సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ఉస్తాద్ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus