తెలుగు సినిమాల్లో తెలుగమ్మాయిలు… ఈ డిస్కషన్ ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లుగా ఈ చర్చ నడుస్తూనే ఉంది. కారణం.. తెలుగు సినిమాల్లో తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్లు తీసుకోరు అనే చర్చ ఒకటైతే, తెలుగు అమ్మాయిలు ముందుకు రాకపోవడం వల్లనే అని మరో వర్గం చర్చ. అయితే ఈ విషయలో యువ కథానాయిక కావ్య కల్యాణ్ రామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చాలా ఏళ్లుగా చర్చలో ఉన్న ఈ అంశంలో ఇదో కొత్త యాంగిల్ అని చెప్పొచ్చు.
‘గంగోత్రి’తో బాల నటిగా బంపర్ హిట్ కొట్టిన కావ్య… హీరోయిన్‌గా ‘మసూద’, ‘బలగం’ అంటూ ప్రారంభంలోనే మంచి విజయాలు అందుకుంది. త్వరలోనే ‘ఉస్తాద్’ సినిమాతో రాబోతోంది. ఈ సినిమా ఈ నెల 12న వస్తున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడింది. ‘మసూద’, ‘బలగం’, ‘ఉస్తాద్’ దర్శకులు తమ పాత్రలకి తెలుగమ్మాయే కావాలనుకున్నారు. అలా నాకు అవకాశం వచ్చింది. నేను తెలుగమ్మాయి కావడం అలా మేలయ్యింది అని చెప్పింది (Kavya Kalyanram) కావ్య.
అయితే కేవలం తెలుగు వస్తే చాలు.. సినిమాల్లో అవకాశం వస్తుందని కాదు అని ట్విస్ట్ వచ్చింది. సినిమా పరిశ్రమలో కేవలం భాషతో ఏమీ రాదని, నటన కూడా ముఖ్యమే అని చెప్పింది. అలాగే తాను భవిష్యత్తులో తమిళం, మలయాళంలోకి కూడా వెళ్లొచ్చు అంటూ ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పింది. తెలుగమ్మాయిలకి అవకాశాలు రావడం లేదనే విషయంపై చర్చ తనకు నచ్చదని చెప్పి కావ్య… శ్రీదేవి, సావిత్రి లాంటి హీరోయిన్లు గొప్ప అవకాశాలు, విజయాల్ని అందుకుని తెలుగమ్మాయిలు సాధించగలరని ఎప్పుడో నిరూపించారు కదా అని పాయింట్ లాగింది.
‘జైలర్’, ‘భోళా శంకర్’ బరిలో ఉన్నప్పుడు వస్తున్నారు కదా మీ ‘ఉస్తాద్’ ధైర్యం ఏంటి అని అడిగితే… వాళ్ల సినిమాలు చూడటానికి వచ్చి టికెట్లు దొరక్కపోతే, మా సినిమా చూడటానికైనా వస్తారు కదా అంటూ నవ్వేసింది కావ్య. మరి చాలా రోజులుగా తెలియకుండానే వాయిదా పడుతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!